చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాన్ని మంగళవారం రాత్రి 7 గంటలకు మూసివేశారు. అపుడు టిటిడి ఇవో మాట్లాడుతూ బుధవారం ఉదయాత్పూర్వం 1.31 నుండి 4.29 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుందని, గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు.
ఈ రోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా ఉదయం 11 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైందని, ఇప్పటివరకు 37,144 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు.
అన్నప్రసాద భవనాన్ని కూడా మూసివేశామని, దీన్ని దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 20 వేల మంది భక్తులకు పులిహోర, టమోటా రైస్ ప్యాకెట్లు అందించామని వివరించారు.
బుధవారం ఉదయం 5 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహించారు.
ఉదయం సుప్రభాతం, తోమాలసేవ ఏకాంతంగా నిర్వహిస్తామని, అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఆణివార ఆస్థానం ఆగమోక్తంగా నిర్వహించారు.
ఆ తరువాత భక్తులకు సర్వదర్శనం ప్రారంభమయింది. ఇప్పటివరకు భక్తులు బాగా సహకరించారని, రేపు కూడా దర్శన సమయం తక్కువగా ఉండడంతో భక్తులు సహకరించాలని ఇవొ కోరారు.