ఇరా సింఘల్ : 2015 సివిల్స్ సెన్సేషన్ తెర వెనక కథ తెలుసా?

ఇరా సింఘల్ పేరు విన్నారుగా. ఆమె 2105 సివిల్స్ సెన్సేషన్. ఆయేడాది సివిల్స్ టాపర్. సెలెక్ట్ అయ్యాక కూడా ఐఎఎస్ సాధించడానికి ఆమె చాలా పోరాటం చేశారు.
ఇపుడామె ఢిల్లీ మునిసిపల్ స్కూళ్లలో ఒక పెద్ద మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె నార్త్  ఢిలీ మునిసిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ కమిషనర్ గా పని చేస్తున్నారు.
మునిసిపల్ స్కూళ్లంటేనే చాలా పేద వాళ్ల స్కూళ్లు. అక్కడ విద్యార్థులమీద టీచర్లు చాలామందిలో పెద్దగా శ్రద్ధ ఉండదు. వీళ్లెక్కడ చదివి చస్తారులే అనే దురభిప్రాయం ఉంటుంది. దీనికితోడు ఈ విద్యార్థుల్లో వైకల్యం ఉన్న వాళ్లుంటే వాళ్లను ఇంకా చులకనగా చూస్తారు. పేదరికం వైకల్యం రెండు కలిస్తే జీవితం దుర్భరంగా వుంటుంది.
అందువల్ల ఈ రెండింటితో మునిసిపల్ స్కూళ్ల కి వచ్చే పిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలి, వాళ్లని ఎలా ఎంకరేజ్ చేయాలి అనే విషయాన్ని ఆమె టీచర్లకు నేర్పించాలనుకున్నారు. పాఠశాల బాగుపడాలంటే ముందు పిల్లల పట్ల అందునా ఏదో ఒక వైకల్యం ఉన్న వారి పట్ల టీచర్ల వైఖరి మారాలని ఆమె నమ్ముతున్నారు.
అందుకే  టీచర్లకు వైకల్యం ఉన్న వారి పట్ల అనుసరించాల్సిన పద్దతుల మీద ఆమె మునిసిపల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్ కు ఒక శిక్షణా కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఇలాంటి ప్రయత్నం  దేశంలో ఇదే మొట్టమొదటి సారి.
ఈ వయసులోనే పిల్లలనుంచి ఆత్మన్యూనతా భావం పొగొట్టాలి. విజన్ దివ్యాంగ్ అనే ఎన్జీవొ సహకారంతో ఆమె కార్యక్రమంచేపడుతున్నారు. దివ్యాంగులు ఎవరికంటే తక్కువ కాదనే భావం అందరిలో తీసుకువచ్చేందుకు ఆమె ఈ కృషి మొదలుపెట్టారు.
దీనికి వెనక ఆమె ఐఎస్ ఎస్ కు ఎంపికయ్యేందుకు చేసిన పోరాటమే కారణం.
ఆపోరాటమే ఆమె ను ఉద్యోగంలో కూడా నడిపిస్తూ ఉంది.
భారతదేశంలో సివిల్స్ టాపర్ గా వచ్చిన మొట్టమొదటి దివ్యాంగురాలు ఇరా సింఘల్. ఆమె స్కోలియో సిస్ బాధితురాలు. వెన్నెముక ఒకవైపు వంగి పోయి ఉంటుంది. గూని వచ్చేందుకు కారణమిదే.
(ఈ స్టోరీ మీకు నచ్చితే, అందరికీ షేర్ చేయండి, trendingtelugunews.com ను ఫాలో కండి)
ఈ పరిస్థితెపుడూ ఆమె చదువులో అడ్డంకి కాలేదు. మొదట సిఎస్ ఇ లో కూడా ఆల్ ఇండియా టాపర్ గా వచ్చారు. తర్వాత  సివిల్స్ లో 2015లో ఆల్ ఇండియా ర్యాంక్ 1 తో టాపర్ గా వచ్చారు.
అయితే, సివిల్స్ రాయాలన్న అలోచన ఆమెకు చాలా ఆలస్యం గా వచ్చింది. అదే విచిత్రం.
ఆమె స్కూల్ చదువంతా ఉత్తర ప్రదేశ్ మీరట్ లోసాగింది. తర్వాత ఢిల్లీ నేతాజీ సుభాష్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్శిటీలో మార్కెటింగ్, ఫైనాన్స్ లో ఎం బిఎ చేశారు.
తర్వాత ఆమె కాడ్ బరీస్ స్ట్రాటజీ మేనేజర్ గా చేరారు. అంతవరకు ఎపుడూ ఆమె సివిల్స్ రాయాలన్నఆలోచన రాలేదు. కాడ్ బరీస్ పనిచేస్తున్నపుడు సివిల్స్ రాయలన్న ఆలోచన వచ్చింది.
అయితే,చాలా చిన్నపుడే ఆమె మైండ్ లో కలెక్టర్ ముద్ర పడి ఉంది. మీరట్ మత సంబంధంగా చాలా సెన్సిటివ్ ప్రాంతం. ఆమె చిన్నపుడు మత ఘర్షణలు చెలరేగడం, కర్ఫ్యూ విధించడం ఎపుడూ జరిగేది. ఎపూడు కర్ఫ్యూ ప్రకటన వినపడేది. వినపడినపుడల్లా అందులో డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (కలెక్టర్) మాట వినిపించేది. కర్ఫ్యూ అనే దాన్ని ఒక వ్యక్తి విధిస్తాడని ఆమె అపుడే తెలిసింది. అంటే ఎవరె డిఎం అనే వ్యక్తికి కర్ఫ్యూ విధించేంత శక్తి ఉంటుందన్నమాట అనేది ఆమె మనసులోనాటుకుపోయిఉండింది. ఈ ఆలోచన అంతకు మించి పెరగలేదు.
మళ్లీ కాడ్బరీస్ లో ఉద్యోగం చేస్తున్నపుడు హఠాత్తుగా సివిల్స్ రాస్తే ఎలా ఉంటుందని పించింది. సివిల్స్ రాశారు. 2015లో ఐఎఎస్ కు ఎంపిక అయ్యారు. యుపిఎస్ సి వాళ్లు ఆమెకు అంతసులభంగా ఐఎఎస్ కేటాయించలేదు.
ఆమె అంగవైలక్యం ఉంది కాబట్టి ఐఆర్ ఎస్ తప్ప మరొక ఉద్యోగం ఇవ్వలేమని యుపిఎస్ సి తెగేసిచెప్పింది. అయితే, అమె దీనికి అంగీకరించలేదు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యులన్ (CAT) యుపిఎస్ సి నిర్ణయాన్ని చాలెంజ్ చేశారు. చాలా కాలం పోరాడిన తర్వాత 2014లో ఆమె కేసు గెలిచారు.
ఈ కేసు పెండింగులో ఉన్నపుడు ఆమె సివిల్స్ పరీక్ష మళ్లీ రాశారు. పాసయ్యారు. మళ్లీ అదే సర్వీసు ఆమెకు కేటాయించారు.
సరిగ్గా అదే సమయంలోనే క్యాట్ తీర్పు వచ్చింది. అయితే, యుపిఎస్ సి దీనికి వెంటనే స్పందించ లేదు. మూన్నెళ్ల పాటు మౌనంగా ఉండిపోయింది.
సరే ఈ పేపర్ వర్క్ ఉంటుందిగా అనుకుని ఇరా ఓపిక తో జాయినింగ్ లెటర్ కోసం ఎదురుచూసింది. మిత్రుల సలహా మేరకు ఆమె సివిల్స్ మరొక సారి రాసింది. ఇది నాలుగోసారి బాగా అయిష్టంగా ప్రిలిమ్స్ రాసింది. ఈ దశలో ఆమె కు యుపిఎస్ సి నుంచి పిలుపు వచ్చింది.
తనకు ఇలా అడ్డంకి ఎదురయ్యే దాకా ఇరా ఒక మాయప్రపంచంలో ఉండింది, ప్రభుత్వం దృష్టిలో అంతా సమానమే నని, తనకు ఒక అవకాశం లభిస్తుందని అనుకుంటూ వచ్చింది. ప్రయివేటు సెక్టర్ లో ఇలాంటి వివక్ష ఉంటుందని అనుకునేది. అయితే, ఇపుడు తనే వివక్షకు గురయింది. ఇలాంటి వివక్ష కు ఫుల్ స్టాప్ పెట్టాలనుకునే తాను యుపిఎస్ సి నిర్ణయాన్ని క్యాట్ లో చాలెంజ్ చేశానని ఆమె చెప్పారు.
తనలాంటి వాళ్ళి మరొక సారి ఈ వివక్ష ఎదురు కాకూడదని నా పట్టుదల. అందుకే న్యాయపోరాటం చేశాను, అని అమె చెప్పారు.
ఇరా నిలువెత్తు ఆత్మ విశ్వాసం. అందుకే ఆమె ఎపుడూ ఎక్కడా తన వైకల్యాన్నిఆసరా చేసుకునో, వైకల్యం దయాదాక్షిణ్యంతోనో బతకాలనుకోలేదు. అన్ని పరిస్థితులను మేధస్సుతోనే ఎదుర్కొంది.
ఢిల్లీ మునిసిపల్ స్కూళ్ల పిల్లలను కూడా ఆమె అలాతీర్చిదిద్దాలనుకుంటున్నారు. ఈ ఉద్యోగంలో ఆమె ఎంతకాలం ఉంటారో తెలియదు, ఒక పనిని ప్రారంభించారు. ఎవరో ఒకరు ముందుకు తీసుకువెళ్తారని నమ్మకం.
(ఈ స్టోరీ మీకు నచ్చితే, అందరికీ షేర్ చేయండి, trendingtelugunews.com ను ఫాలో కండి)

(ఫోటోలు Ira Singhal facebook టైమ్ లైన్ నుంచి)