జూన్ నెలలో తిరుమలేశుడి ఆదాయం రు.100 కోట్లు

తిరుమ‌ల శ్రీ‌ వేంకటేశ్వర స్వామి వారిని ఈ ఏడాది జూన్ నెల‌లో 24.66 ల‌క్ష‌ల మంది ద‌ర్శించుకున్నారు. ఇందులో భాగంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం, హుండీ ఆదాయం, ల‌డ్డూ ప్ర‌సాదాలు, అన్నప్రసాదాల పంపిణీ, తలనీలాలు వగైరాల కలిసి మొత్తం ఏడుకొండలవాడు రు. వందకోట్లు ఆర్జించారని తిరుమల తిరుపతి ప్రజాసంబంధాల అధికారి తెలిపారు. 2019 జూన్ నెల విశేషాలు

దర్శనం :2018 జూన్‌లో 24.1 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది జూన్‌లో 24.66 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

హుండీ ఆదాయం : శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది జూన్‌లో రూ.91.81 కోట్లు కాగా, ఈ ఏడాది జూన్‌లో రూ.100.37 కోట్లు వచ్చింది.

అన్నప్రసాదం :  గతేడాది జూన్‌లో 64.05 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, ఈ ఏడాది జూన్‌లో 71.02 లక్షల మంది భక్తులకు అందజేయడం జరిగింది.

లడ్డూలు :  గతేడాది జూన్‌లో 95.58 లక్షల లడ్డూలు అందించగా, ఈ ఏడాది జూన్‌లో 1.13 కోట్ల‌ లడ్డూలను అందించారు.

తలనీలాలు :  గతేడాది జూన్‌లో 11.9 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించగా, ఈ జూన్‌లో 12.88 లక్షల మంది తలనీలాలు సమర్పించారు.

గ‌దులు :  గ‌దుల ఆక్యుపెన్సీ గతేడాది జూన్‌లో 106 శాతం న‌మోదు కాగా, ఈ ఏడాది జూన్‌లో 107 శాతం న‌మోదైంది.