భారత్ లో విలీనమయిన రెండో తెలుగు ప్రాంత సంస్థానమిదే…

ఆపరేషన్ ఫోలో (సెప్టెంబర్ 13-18 1948) తర్వాత దేశంలో అతి పెద్ద సంస్థామయిన నైజాం భారత యూనియన్ లో చేరేందుకు అంగీకరించింది.
పోలీస్ యాక్షన్ పేరుతో జరిగిన ఈ చర్యకు ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ అని కూడ పేరుంది.
నిజాంలా మరొక సంస్థానమేదీ భారత్ లో చేరేందుకు విముఖత చూపలేదు. అవన్నీ చిన్న సంస్థానాలు కావడం, వాటికి నిజాంలాగా స్వాంతంత్య్రం పొందాలనుకునే దురాశ లేకపోవడం దీనికి కారణం.
ఇలా భారత యూనియన్ లో విలీనం అయిన సంస్థానాలలో తెలుగు ప్రాంతాలనుంచి మరొక సంస్థానం కూడా ఉంది. బ్రిటిష్ పరిపాలన సాగినంత కాలం నిజాంలాగానే ఈ సంస్థానం కూడా స్వతంత్ర సంస్థానమే.
ఆ సంస్థానమే బనగానపల్లె. ఇపుడు కర్నూల్ జిల్లాలో ఉంది.
నిజానికి ఈ విషయం చాలా మందికి తెలియదు. చిన్న సంస్థానం కావడం తో ఇది చరిత్రలోకి ఎక్క లేదు. ఈ చిన్న సంస్థానాన్ని బ్రిటిష్ వాళ్లెందుకు తమ భూభాగంలో విలీనమ చేసుకోలేదో అర్థం కాదు.
ఈ సంస్థానం స్వతంత్ర ప్రతిపత్తిని వాళ్లెపుడూ గౌరవిస్తూనే వచ్చారు. సంస్థానం పాలనలో అవకతవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదు వచ్చినపుడో,  కరువు కాటకలా వల్ల సంస్థానికి ఆర్థిక సమస్యమలు వచ్చినపుడో బ్రిటిష్ వాళ్లు తాత్కాలికంగా ఈ సంస్థానినా స్వాదీనం చేసుకుని, కొద్ది రోజుల తర్వాత మళ్లీ నవాబు కుటుంబానికి అప్పగించే వాళ్లు.
సుమారు నాలుగు వందల సంవత్సరాలు ఈ సంస్థానం ఒకే కుటుంబ పాలనలోనే నిరాటంకంగా సాగింది.
అయితే ఈ సంస్థానం చివరి ఘట్టం 1948, ఫిబ్రవరి 20 న ముగిసింది. ఆ రోజున ముస్లిం ప్రభువు ఏలుబడిలో ఉన్న బనగనపల్లె సంస్థానం భారత యూనియన్ లో అంటే నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలో విలీనమమయింది.
అపుడు ఈ సంస్థానానికి మీర్ ఫజల్ ఇ అలీఖాన్ ( సయ్యద్ గులామ్ ముహమ్మద్ అలీఖాన్ పెద్ద కొడుకు)నవాబుగా ఉండేవాడు. అతను హైదరాబాద్ లోని సెయింట్ జార్జిస్ గ్రామర్ స్కూల్లో, మద్రాస్ న్యూయింగ్టన్ ఇన్ స్టిట్యూట్, అజ్మీర్ లో మయో కాలేజీలో చదువుకున్నాడు.
1922 జనవరి 22న తండ్రి చనిపోవడంతో నవాబు(మూడవ బహదూర్) అయ్యాడు.మద్రాస్ గవర్నర్ లార్డ్ విల్లింగ్డన్ స్వయంగా బనగానపల్లె కు వచ్చి 1922 జూలై 6న ఆయనను సింహాసనం (musnaid)మీద కూర్చో బెట్టాడు.
తర్వాత పరిపాలనలో, ముఖ్యంగా న్యాయ పరిపాలనలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు రావడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని తొలగించింది. అంతేకాదు, 1939-47 దాకా రాజ్యం బయటే ఉండాలని శాసించింది. తర్వాత స్వాతంత్రం రావడానికి ముందు ఆయన్ని నవాబుగా పునరుద్ధరించింది.
బనగానపల్లెను భారత యూనియన్ లో విలీనంచేసే ఒప్పందం (Instrument of accession) మీద ఆయనే సంతకం చేశాడు.
దీనితో బనగానపల్లె సంస్థానం ఫిబ్రవరి 20,1948న మద్రాస్ ప్రెశిడెన్సీలో విలీనమయింది. ఈ ప్రాంతాన్ని నాటి  ప్రెశిడెన్సీలోని కర్నూల్ జిల్లాలో కలిపారు.
అయితే, ఆయనకు His Highness అనే సత్కారం అందించింది.  ఆ యేడాది జూలై లో 1 ఆయన చనిపోయాడు.
Read Also: టీ,చాయ్ మాటలెలా వచ్చాయో తెలుసా?
తర్వాత ఆయన కుమారుడు మీర్ గులామ్ అలీఖాన్ (నాలుగవ బహదూర్) వారసుడయ్యాడు. తండ్రికి బ్రిటిష్ ప్రభుత్వం, తర్వాత భారత ప్రభుత్వం అందించిన మర్యాదలన్నీ అందుకున్నాడు. అయితే, సెప్టెంబర్ 6, 71970న భారత ప్రభుత్వం ఈ మర్యాదలన్నింటిని రద్దు చేసింది.
ఆయన కోర్టుకు వెళ్లి వాటిని పునరుద్ధరించుకున్నాడు. ఈ సంస్థానం వారుసులొకరు పబ్లిక్ న కనిపించడం అదే మొదలు.
కాని, భారత ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించి  సంస్థాలానుకున్న ఈ మర్యాదలన్నంటిని రద్దు చేసింది. దీనితో బనగానపల్లె నవాబుగా ఆయనకు ఉన్న గుర్తింపు (Ruler), తద్వారా దక్కుతూ వచ్చిన భరణం (Privy purse) 1971 డిసెంబర్ 28 న రద్దయ్యాయి. దీనితో బనగానపల్లె సంస్థానం చరిత్ర పూర్తిగా ముగిసింది. చివరి నవాబు 1983డిసెంబర్ లో చనిపోయాడు.తర్వాత ఆయన కుమారుడు 4వ నవాబ్ సయ్యిద్ ఫజ్లి అలీఖాన్ వారుసుడిగా ప్రకటించుకున్నాడు. ఆయన వారసులు హైదరాబాద్ లోనే ఉంటున్నారు.

 (ఇది నచ్చితే మీ మిత్రులందరికి షేర్ చేయండి. trendingtelugunews.com ను ఫాలో కండి)

ఈ సంస్థానానికి కూడా సుదీర్ఘమయిన చరిత్ర ఉంది. 1601లో రాజా నంద చక్రవర్తి పాలనలో ఉన్న బనగాన పల్లెను బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా జయించడంతో ఇక్కడ ముస్లింపాలన మొదలయింది. ఆయన సిద్ధు సుంబల్ ను ఈ కోట పాలకుడిగా నియమించాడు.
ఆయన 1665 దాకా పరిపాలించాడు. తర్వాత ముహమ్మద్ బేగ్ ఖాని రోసెబహానీ బనగానపల్లె కోట కమాండర్ అయ్యాడు.
ఆయనకు కొడుకులెవరూ లేకపోవడంతో కూతురు కొడుకుని దత్తత తీసుకుని వారసుడిని చేశాడు. అతని పేరు ముహమ్మద్ బేగ్ ఖాన్ నజ్మిసాని. అయితే, ఫాయిజ్ అలిఖాన్ బహదూర్ అనే బిరుదుతో బనగానపల్లెకోట కమాండర్ అయ్యాడు.
తర్వాత బీజాపూర్ ను మొగలులు జయించినపుడు బనగానపల్లె స్వతంత్ర రాజ్యం అయింది. ఆయన తాత, ముబ్రైజ్ ఖాన్ మొగలులకు దక్కన్ వైస్రాయ్ గా ఉండే వాడు. ఆయన జోక్యంచేసుకుని బీజాపూర్ రాజ్యంలో భాగంగా కాకుండా మనవడు స్వతంత్రంగా పరిపాలించేందుకు ఏర్పాట్లు చేసి హక్కులు సంపాదించిపెట్టారు.
మనం చెప్పుకునే బనగాన పల్లె సంస్థానం చరిత్ర దీనితో మొదలయింది. తర్వాత వచ్చిన పాలకులంతా ఫాయిజ్  అలీఖన్ బహదూర్ వారసులే.
వీళ్లకుటుంబం అక్బర్ చక్రవర్తికాలంలో భారత్ కు వలస వచ్చారని చెబుతారు. తర్వాత ముస్లిం సంపన్న కుటుంబాలనుంచి వివాహాలు చేసుకుని, రాజ్యంలో హోదా పొంది మిలిటరీ జనర్సల్ స్థాయికి ఎదిగారు.
దక్కన్ ను మొగలులు జయించినపుడు ఫాయిజ్ అలీ కి బనగాన పల్లె దక్కినట్లు, ఆయన సోదరుడు ఫజల్ అలీకి చెంచెలిమల  జాగీరును బహూకరించారు.
అయితే, పజల్ చనిపోయాక, ఈ జాగిర్ బనగాన పల్లెలో భాగమయింది.
ఒక దశలో ఈ కుటుంబానికి టిప్పు సుల్తాన్ కి గొడవలొచ్చాయి. దీనితో వారు పారిపోయి హైదరాబాద్ లో తలదాచుకున్నారు.
కొద్ది రోజుల తర్వాత తిరిగివచ్చి 1789లో టిప్పు సేనలను వోడించి బనగానపల్లెను తమ అదీనంలోకి తెచ్చుకున్నారు.
1832లో బనగాన పల్లె పరిపాలన బాగా లేదని ఈ సంస్థానాన్ని మద్రాసు ప్రెశిడెన్సీలో కలిపేసుకుని నవాబుకు పెన్షన్ ఇచ్చి హైదరాబాద్ కు పంపించేశారు.
1848తో మద్రాస్ పాలక మండలి సంస్థానాన్ని మళ్లీ నవాబుల కుటుంబానికే అప్పచెప్పింది. అయితే, పరిపాలన సరిగా లేనపుడల్లా బ్రిటిష్ వారు బనగానపల్లెను తాత్కాలికంగా తమ అదుపులోకి తీసుకునేవారు. సమయం రాగానే నవాబుల కుటుంబానికి పాలన అందించే వారు.(ఫోటోలు సంస్థానం జండా, చివరి నవాబు. ముఖచిత్రం నవాబుల బంగళా)
(బనగానపల్లె నవాబుల పూర్తి చరిత్ర ఇక్కడ ఉంది)