ప్రజావేదిక అనే రేకుల షెడ్డును హెరిటేజ్ కంపెనీ డబ్బుతో ఏమైనా కట్టారా లోకేశ్. మీరు, మీ ముఠా సభ్యులు తెగ ఆవేశ పడుతున్నారు. రూ.50 లక్షల విలువ చేయని తాత్కాలిక నిర్మాణానికి రూ.9 కోట్లు దోచుకు తిన్నది బయట పడిందనా ఏడుపులు? కిరాయి మనుషులతో పరామర్శలు, విషాద ఆలాపనలు ఏందయ్యా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 1, 2019
ఈ ట్వీట్ మిద టీడీపీ నాయకురాలు దివ్యవాణి మండి పడ్డారు….ఇలా
అయ్యా అక్రమ సాయి రెడ్డి గారు..
రంజాన్ పేరుతో 6 వేల మందికి భోజనాలు పెట్టడానికి 1.1 కోట్లు-జి.ఓ-1206… ఈ సొమ్ము సండూర్ పవర్ కమ్ పెనీ సొత్తా ?
జగన్ గారి ఇంటి ముందు 1.3 కిమీ రోడ్డు వెయ్యడానికి 5 కోట్లు-జి.ఓ-132…ఈ ఖర్చు భారతి సిమెంట్స్ నుండి ఖర్చు చేసారా?
జగన్ గారి నివాసం దగ్గర టాయిలెట్స్ కట్టడానికి 30 లక్షలు-జి.ఓ-133…ఈ సొమ్ము జగతి పబ్లికేషన్స్ నుండి కట్టారా ?
జగన్ గారి ప్యాలస్ దగ్గర బ్యారికేడ్లు పెట్టడానికి 75 లక్షలు-జి-ఓ-133..ఈ సొమ్ము కార్మెల్ ఏషియా చెల్లించిందా?
కొట్టేయడంలో మీరు పిహెచ్డి చేసారు.మీ రికార్డులు మీరే తిరగరాస్తున్నారు…ఇక మిగిలింది గుడిలో లింగం మాత్రమే