హైదరాబాద్ మెట్రోరైళ్లకు సాంకేతిక సమస్యలు…


సాంకేతిక కారణాల వల్ల అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ మార్గంలో తిరుగుతున్న మెట్రో రైళ్లు ఆలస్యం అవుతున్నాయని మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి అంగీకరించారు.దీనికి ఆయన వివరణ ఇచ్చారు.
ఆయన చెప్పిన కారణాలివి:
​​సాంకేతిక కారణాల వల్ల రైలు ఆగిపోయింది.  గడిచిన కొద్దిరోజులుగా సాంకేతిక సమస్య మూడుసార్లు ఉత్పన్నమైంది.

​​ఈరోజు ఉదయం సాంకేతిక సమస్య కారణంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 స్టేషన్ లో ట్రైన్ నిలిచిపోయింది…

​సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని సార్లు 15 నిమిషాలకు పైగా ఒక ట్రైన్ కు మరొక ట్రైన్ కు మధ్య వ్యవధి పెరిగింది.
​​​ఏడున్నర నిమిషాలకు ఒక ట్రైన్ నడపాలని మొదట్లో నిర్ణయించినప్పటికీ కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీనివల్ల అలా నడపడం సాధ్యం కావడం లేదు.

​​ప్రయాణికుల భద్రత దృష్ట్యా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 స్టేషన్లో ట్రైన్ ను నిలిపి వేయడం జరుగుతున్నది.

​​ఇలాంటి సందర్భాల్లో ఎమర్జెన్సీ బటన్ నొక్కి ఎందుకు ట్రైన్ ఆగింది అంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు…

​​ట్రైన్ సాంకేతిక కారణాలతో ఆగిపోయినప్పుడు ప్రయాణికులు ఇబ్బందికి గురి కాకుండా ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇవ్వాలని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీని ఆదేశించాం.