తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు ఇంటర్వ్యూ శిక్షణ

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ – 2 ఇంటర్వ్యూకి ఎంపికైన B C అభ్యర్థులకు ఉచిత శిక్షణా మరియు మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు. బిసి  సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ విషయం వెల్లడించారు.
 
వెనకబడిన కులాల సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు గ్రూప్ – 2 కి ఎంపికైన అభ్యర్థులకు హైద్రాబాద్ బిసి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఉంటుంది. అలాగే వారికోసం మాక్ ఇంటర్వ్యూలు జూన్ 27 నుండి నిర్వహిస్తారు. విద్యార్థులు  ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.  వివరాలకు 63024 27521 / 040 27077929 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చని  బిసి స్టడీ సర్కిల్, డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.