టిడిపిలో సంక్షోభం, పార్టీ వీడనున్న నలుగురు ఎంపిలు?

దేశంలో ఆ మధ్ వూపందుకున్న కొత్త రాజకీయాలు ఇపుడు కొత్త మలుపు తిరుతుగున్నాయి. గెలిచిన పార్టీలు ఓడిన పార్టీలను అంతమొందించేందుకు అన్ని విధాల ప్రయత్నాలు జరగుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్టీ దాాకా ఈ వ్యూహాలు చాలా పకడ్బందీగా అమలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇపుడు ఈ మలుపు సంక్షోభంంలో కూరుకుపోతున్నది.

ఎన్నికల పరాభవం తర్వాత టిడిపిలో తీవ్రపరిణమాలు వస్తున్నాయి. పార్లమెంటరీపార్టీలో చీలిక వచ్చే సూచనకనిపిస్తున్నాయి. నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీకి గుడ్ చెప్పబోతున్నట్లు ఒక వార్త ప్రచారమవుతూ ఉంది.

తమను ప్రత్యేక గ్రూప్ కు ప్రరిగణించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా, సీఎం రమేష్, గరికపాటి, టిజి వెంకటేష్ లేఖ రాస్తున్నట్లు ఈ వార్త సారాంశం.

రాజ్యసభలో ప్రధాని మోడీ, అమిత్ షా తో మాట్లాడిన నలుగురు టీడీపీ ఎంపీలు పార్టీకి గుడ్ బై కొట్టిని పదవిని కాపాడుకునేందుకు ఈ పథకం వేసినట్లు సమాచారం.

ఏ క్షణంలోనైనా రాజ్యసభ చైర్మన్ కు లేఖ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారని చెబుతున్నారు.

టీడీపీ ఎంపీలను బీజేపీ  అనుబధ సభ్యులుగా చేర్చుకునెందుకు అమిత్ షా పధకం రచించారని అంటున్నారు.

నలుగురు ఎంపీల బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు అప్పగించారని, ఆయనే వారితో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు.

ఈ నలుగురు పోతే, ఇక ఇద్దరు ఎంపిలు మాత్రం టిడిపిలో ఉంటారు.

వారిని కూడా టీడీపీ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నారని తెలిసింది.  ఇదే విధంగా లోకసభ సభ్యులు కూడా తమతో టచ్ లో ఉన్నట్లు వెల్లడించిన బీజేపీ నేతలు చెబుతున్నారు.