ఇలాంటిదెక్కడా జరిగి ఉండదని నేననుకుంటున్నాను. కేరళ లో జరిగింది.ఇండియాలో మాత్రం ఇదే మొదటిసారి. కొంతమంది స్కూలు పిల్లలు, తమ టీచర్ల మార్గదర్శకత్వంలో ఏకంగా ఐటి కంపెనీ ప్రారంభించారు. మన అందరికి ఐటి సేవలందించేందుకు సిద్ధమయ్యారు.
ఈ కంపెనీ ఎక్కడో ఐటిహబ్ లోనో, రాజధానుల్లో వుండే సిలికాన్ వ్యాలిలోనో పుట్టలేదు. కేరళలో ఒక మారుమూల పల్లెలో తలెత్తింది. ఏడో తరగతి, ఎనిమిదో తరగతి చదువుతున్న 12 మంది KVUPS(పాంగోడ్) విద్యార్థులు గ్రోలియస్ (Grolius- Grow Like Us) అనే పేరుతో కంపెనీ ప్రారంభించారు. ఇది ఎయిడెడ్ స్కూల్.ఈ స్కూలు కేరళ రాజధాని తిరువనంతపురంకు సమీపంలోని పాంగోడ్ జిల్లాలో ఉంటుంది.
ఒకప్పుడు సరిగ్గా జరగక, విద్యార్థులను చేర్పించేందుకు తల్లితండ్రులు ముందుకురాక, మూతపడే పరిస్థితి వచ్చింది. ఇపుడీ స్కూల్ ఐటిలో హిస్టరీ సృష్టించింది. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు కూడా తెగించి చేయలేని పనిని ఈ పోరగాళ్లు చేసి ఔరా అనిపించుకున్నారు.
ఈ స్కూలు ఆవరణలోనే ఒక ప్రయివేటు కంపెనీ ప్రారంభించిన ఐటి పార్క్ ను చూసి వీళ్లంతా ప్రేరణ పొందారు.
టీచర్లు వీళ్ల భజం తట్టారు. వీళ్ల ఉత్సాహానికి మాజీ విద్యార్థులు సహకరించారు. అంతే, కంపెనీ మొదలయింది. వ్యాపారం ప్రారంభించింది. ఈ కంపెనీకి ఇపుడు ఏనిమిదో తరగతి చదువుతున్న హలీలా ఫాతిమా సిఇవొ.
టీమ్ లోని విద్యార్థులకు HTML, CSS, JavaScript, JQuery, PHP, WordPress, Python, Django, My SQL, PostgreSQL శిక్షణ ఇప్పించారు. సకాలంలో ఈ చవగ్గా ఈ సేవలందించేందుకు మార్కెట్లో అవకాశలు లేవని కనుగొన్నారు. ఎందుకంటే, ఒక వెబ్ సైట్ ప్రారంభించాలంటే, ఎలాగో ఎవ్వరీకి తెలియదు, ఎవరిని పట్టుకోవాలో, వాడెంత డబ్బు అడుగుతాడో తెలియదు. మన అజ్ఞానాన్ని టెక్నికల్ నాలెడ్జ్ పేరతో సొమ్ముచేసుకునే వాళ్లే ఎక్కవ బయట మార్కట్లో. ఇలాంటి వాళ్లకు సేవలందించే ఒక నమ్మకమయిన సంస్థ, స్వలాభాపేక్ష లేని సంస్థ ఉంటే ఎంతబాగుంటుందని నేనే చాలా సార్లు అనుకున్నా. ఈ అసవరాన్ని వీళ్లు తీర్చేశారు.
మొదట వీళ్లు చిన్నప్రాజక్టులు తీసుకుని తమ సత్తా ఏమిటో చూపించారు. ఒక ఏడాదిలోనే వీళ్ల కంపెనీకి చేతినిండా పని ఉంది.
ఇతర కంపెనీలతో పోలిస్తే వీళ్ల తక్కువ ధరలే సర్వీసులందిస్తున్నారు. ఐటి అంటే ఆసక్తి ఉన్న ఈ పిల్లలందరికి స్కూల్ లో క్లాసులు ప్రారంభంకావడాని ముందు, క్లాసులు అయిపోయాక, కోడింగ్ లో శిక్షణ ఇచ్చే వారు. సర్వర్ సెటప్, డొమెయియన్ సపోర్ట్,వెబ్ సైట్ డెవెలప్ మెంట్, వెబ్ సైట్ డిజైన్ లలో ఇపుడు వీరు సేవలందిస్తున్నారు. పెద్ద కంపెనీల్లాగే గ్రోలియస్ కూడా సిఇవొ,సివొవొ, చీఫ్ బిజినెస్ డెవెలప్ మెంట్ ఆఫీసర్,చీఫ్ట టెక్నాలజీ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ … ఇలా అంత సిస్టెమాట్టిక్ గా ఉన్నారు. మార్కెట్ లో ఉన్న రేట్లకంటే బాగా తక్కువ ధరలకే మేం ప్రాజక్టులు ఇంప్లిమెంట్ చేస్తామని చెబుతున్నాడు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ యాసిర్ . కేరళ వరదల్లో చిక్కుక్కున్నపుడు వరద సహాయాన్ని సహాయశిబిరలాకు టంచన్ గా, తప్పిపోకుండా పంపించేందుకు encamp.in అనే వెబ్ సైట్ రూపొందించి ప్రశంసలందుకున్నారు. వచ్చే అయిదారు నెలల్లో కనీసం రెండు లక్షల బిజినెస్ చేయాలనుకుంటున్నారు.
జానెడు లేని ఈ పిల్లగాళ్లను చూసి మొదట్లో ప్రాజక్టులిచ్చేందుకు క్లయింట్స జంకేవాళ్లు. వీళ్లు పిల్లలు కాదు, పిడుగులని చాలా తొందరగా రుజువయింది. తమ ప్రొఫెషనల్ స్కిల్స్ ప్రదర్శించి అందరిని ఆశ్చర్యపరిచారు. మొదట్లో పేరు చూసి వీరికి ప్రాజక్టులిచ్చేందుకు సంప్రదించే వాళ్లు, అయితే ఈ కంపెనీలో పని చేసే వాళ్లంతా బడిపిల్లలని తెలిసుకుని జోక్స్ కూడా వేసేవాళ్లు. అయితే, ఈ పిల్లలు, ఐటి అనేది కేవలం ఎదిగిన వాళ్లకే కాదు, పిల్లలకు కూడా అని వాళ్లు రుజువు చేశారు. గ్రాజుయేట్ల కంటే పిల్లలు తక్కువేం కాదని అని ఒక ఏడాది లోనే నిరూపించుకున్నారు.
వీళ్లంతా రు. 2000 నుంచి రు.10,000 మధ్య చార్జ్ చేస్తూ డోమైన్ సపోర్టు చేస్తారు. కంపెనీ పెట్టి రెండేళ్లు కూడా పూర్తి కాలే. అపుడే వీళ్లు ఇతర స్కూళ్లలో తమ వెంచర్ గురించి వర్క్ షాపులు కూడా నిర్వహిస్తున్నారు.
ఇదెలా మొదలయిందంటే…
ఈ ప్రాజక్టు మొదట కంపెనీ పెట్టాలనే ఉద్దేశంతో మొదలు కాలేదు. విద్యార్థుల్లో టెక్నికల్ ఎవేర్ నెస్ క్రియోట్ చేసేందుకు మొదలయింది. ప్రాజక్టుకోసం 24 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.అందులోనుంచి 12 మందిని మాత్రం సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్లందరికి ట్రైనింగ్ ఇచ్చారు. ఎన్నిరోజులో తెలుసా? కేవలం 14 రోజులు. ఈ శిక్షణలో ఐటి గురించి ప్రాథమిక సూత్రాలన్నీ నేర్పించారు. వీళ్లంతా ఊహించినదానికంటే ఫాస్ట్ గా పిల్లలు నేర్చుకున్నారు. కోడ్ ఎలా రాయడం, ప్రోగ్రామ్ డెవెలప్ చేయడమెలాగో నేర్పించారు. వీళ్లకి Talrop అనే సంస్థ సహకరించింది. గ్రోలియస్ ను పవర్ చేసిందికూడా ఇదే.
ఇపుడందరికి సమద్దిగా పాకెట్ మీన వస్తున్నది. అంతేకాదు, స్కూల్ చదువు అయిపోయాక ఐటి లో ఉండాలనుకుంటారా లేదా మరొక రంగంలో కి వెళ్లిపోవాలనుకుంటారా అనేది వాళ్ల ఇష్టమని హెడ్ మాస్టర్ ఎఎమ్ అన్సారీ చెప్పారు. స్కూల్ చదవయిపోయాక కూడా వాళ్లు కంపెనీకోసం పనిచేయవచ్చని ఆయన చెబుతున్నారు.
‘కస్టమర్ల అవసరాన్ని బట్టి మేం వెబ్ సైట్స్ డిజైన్ చేస్తాం. తొందర్లోనే మా టీమ్ కు బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషెల్ ఇంటెలిజెన్స్ రంగాలను పరిచయం చేయబోతున్నారు. వీటిని ఇంకా ఇంజనీరింగ్ గ్రాజుయేట్లకు కూడా అందించడం లేదు. అయితే, దీని గురించి మా టీమ్ సభ్యులు అపుడు ఉజ్వల భవిష్యత్తు గురించి కలలు కనడం ప్రారంభించారు,’ అని Tolrop ఆపరేటింగ్ ఆఫీసర్ చెప్పారు.
వీళ్లతో బిజినెస్ చేయాలనుకుంటున్నవాళ్లు grolius@talrop.com or grolius.talrop.com సందర్శించవచ్చు. కొత్త వెబ్ సైట్ ప్రారంభించాలనుకుంటున్నవాళ్లు వీళ్ల ని సంప్రదించండి, సహకరించండి. చీప్ అండ్ బెస్ట్.
(ఈ సక్సెస్ స్టోరీ మీకు నచ్చితే, మీకు భేష్ అని పిస్తే, నలుగురికి షేర్ చేయండి. పనికొచ్చే జర్నలిజానికి చేయూత నిచ్చేందుకు trendingtelugunews.com ఫాలోకండి.)