ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న ముఖ్యమంత్రి జగనన్
ప్రభుత్వ ఉద్యోగుల్లాగ సౌకర్యాలు అందిస్తామని హామీ
సీఎం జగన్ నిర్ణయంపై ఆర్టీసీ జేఏసీ హర్షం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోక్యంతో ఎపిఎస్ ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచనను విరమించుకున్నారు.
ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ నేతలు ఈరోజు ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలనీ, లేదంటే సమ్మెకు వెళ్లడం తప్ప తమకు మరో గత్యంతరం లేదని స్పష్టం చేశారు.
వారి సమస్యల పట్ల సీఎం సానుకూలంగా జగన్ స్పందించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులు పొందే సౌకర్యాలన్నీ ఆర్టీసీ కార్మికులకు కల్పిస్తామని కూడా స్పష్టం చేశారు.
ఆర్టీసీ సిబ్బందికి సంబంధించిన న్యాయపరమైన అన్ని డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
సీఎం నిర్ణయంతో సంతృప్తి చెందిన ఆర్టీసీ జేఏసీ రేపటి నుంచి చేపట్టాల్సిన నిరవధిక సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పింది. విలీన ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నెలలు పడుతుందని సీఎం చెప్పారన్నారు.