సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు నిమ్స్ లో వైద్యానికి నిరాకరించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ అంతిమ ధ్యేయమని తాను దీక్ష కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడని నిరసనగా ఆయన దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ మొన్న 12 మంది ఎమ్మెల్యేలు తాము సిఎల్ పి అంటూ టిఆర్ ఎస్ లో విలీనమయిన సంగతి తెలిసిందే. విలీనానికి స్పీకర్ పోచారం శ్రీనివాసులు రెడ్డి ఆమోదం తెలిపారు. అప్పటి నంచి కాంగ్రెస్ ‘ఇది ప్రజాస్వామ్య హత్య’ అని నిరసిస్తూ ఆందోళన తెలుపుతూ ఉంది.
ఇందులో భాగంగా భట్టి 36 గంట నిరాాహార దీక్షకు పూనుకున్నారు. ధర్నాచౌక్ నుంచి ఆయనను నిమ్స్ కు తరలించారు.