అమరావతి వెలగపూడి సచివాలయం మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి కార్యాలయంలోకి ఆయన వేద మంత్రాలపఠనం మధ్య ప్రవేశించారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వరించడం మొదలుపెడుతూ , మూడు ముఖ్యమయిన పైళ్ల మీద ఆయన సంతకాలు చేశారు.
సచివాలయంలో బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. అక్కడ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇక్కడ వివిధ విభాగాధిపతులు, కార్యదర్శులు, సీనియర్ అధికారులు ఉన్నారు, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎంతో నమ్మకంతో ఎన్నుకున్నారు… మీరు పూర్తిగా సహకరిస్తే ప్రజల- ప్రభుత్వ కల సాకారం అవుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు.
మీపై నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వంలో అవినీతి కి ఆస్కారం లేని పారదర్శక పాలన అందించడానికి ధృఢ సంకల్పం తో ఉన్నానని ఆయన చెప్పారు. అవినీతిని నిర్ములించి ప్రభుత్వానికి నిధులు ఆంద చేయండి, అధికారులకు తమకు ఉన్న పూర్తి అవగాహనతో సహకరించాలిఅన్నారు.
ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పని చేయడానికి అధికారులంత సిద్ధంగా ఉన్నారని ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు.
అనేక సవాళ్ళను సైతం ఎదుర్కొని మంచి పనితీరును ప్రదర్శించే ప్రతిభ ఇక్కడ అధికార యంత్రాంగానికి ఉంది, లక్ష్యాలకు అనుగుణంగా, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేసే గొప్ప సామర్థ్యం ఉన్న అధికారులున్నారని ఆయన అన్నారు.