తెలంగాణ స్పీకర్ ఎక్కడ? మండిపడ్డ ఉత్తమ్… (వీడియో)

తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసులు రెడ్డి కనబడటం లేదని,  ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడంలేదని పిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. చివరకు స్పీకర్ ఎక్కడ ఉన్నారో కనుకుని చెప్పాలని అసెంబ్లీ కార్యదర్శికి ఫోన్ చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.

ఈ రోజు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిఎల్ పిని టిఆర్ ఎస్ లో  విలీనంచేయాలని కోరుతూ స్పీకర్ కు లేఖ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఇతర కాంగ్రెస్ నేతలతో కలసి నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆ 12 మంది ఎమ్మెల్యేలు డిఫెక్టర్స్ అని ఆయన అన్నారు. వారికి సీఎల్పీ మీటింగ్ పెట్టే అర్హత లేదని, అదే విధంగా సిఎల్పీని టి ఆర్ ఎస్ లో  లీనం చేసే హక్కు స్పీకర్ కు లేదని ఆయన విమర్శించారు.

జాతీయ పార్టీ కాంగ్రెస్ ను ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనం చేస్తారని ఆయన ప్రశ్నించారు.

ఇలా అనైతికంగా విలీనం ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి కెసిఆయర్, నిస్సిగ్గుగా ,నిర్లజ్జగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని విమర్శించారు.

కాంట్రాక్టు లలో చేసిన దోపిడీ డబ్బుతో మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

ఈ రోజు నిరసనలో ఆయనతో పాటు టి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెశిడెంట్ భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే డి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. వారికి మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. వారినిపోలిసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇది ఇలా ఉంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సీఎల్ప్ నేత భట్టి విక్రమార్క మల్లు ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నరు. మరొక వైపు రోడ్డు మీద మాజీ రాజ్యసభ సభ్యుడు, ఎఐసిసి కార్యదర్శి విహనుమంతరావు ఆందోళనకు దిగారు.

తర్వాత అసెంబ్లీ ముందు ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.