ఇందిరా గాంధీ ఆర్థిక మంత్రి ఎలా అయ్యారంటే…

స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటి దాకా కొన్ని మంత్రిపదవులు కేవలం పురుషుల చేతిలోనే ఉన్నాయి. ఇపుడా వాతావరణం మారుతూ ఉంది. నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయి ఆర్ధిక మంత్రి అయ్యారు.
1947 నుంచి ఇప్పటి దాకా ఈ శాఖ పురుషులచేతిలోనే ఉంది. కాకపోతే, మధ్యలో ఒక్కసారి మాత్రం 1970-71 మధ్య అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అయితే, ఆమె పూర్తి స్తాయి మంత్రికాదు. తాత్కాలిక మంత్రి మాత్రమే.
అదెందుకు జరిగిందంటే…అపుడు తన విధానాలు అమలుచేసేందుకు అర్ధిక మంత్రి గా ఉన్న మొరార్జీ దేశాయ్ అడ్దొస్తారని ఆమె ఆ పదవిని తనే తీసేసుకున్నారు.  ఒకసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం దొరికింది.
ఆర్థిక మంత్రి మార్పిడి వెనక చాలా పెద్ద చరిత్ర ఉంది.
భారత రాజకీయాలలో వారసుడనేదెపుడూ వివాదాస్పదమే. రాజకీయాలలో వారసత్వం చాలా సీరియస్ సమస్యలను తీసుకొస్తూ ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి ఈ సమస్య భారత్ ను పీడిస్తూనే ఉంది.
1964లో ప్రధాని నెహ్రూ చనిపోయారు.
అపుడు ఆయన వారసుడెవరనే ప్రశ్న వచ్చింది.నెహ్రూ క్యాబినెట్ లో  హోంమంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్ ప్రధాని అవుతారని అనుకున్నారు. నిరాడంబరుడు, గాంధేయవాది, నిజాయితీపరుడయిన మొరార్జీ ప్రధాని అవుతారనుకున్నపుడు లాల్ బహదూర్ శాస్త్రిపేరు పైకి వచ్చింది.
కాంగ్రెస్ లో ఉన్న ప్రముఖులంతా శాస్త్రీనే సమర్థించారు. కారణం, నెహ్రూకు, మొరార్జీకి వున్న విబేధాలే. నెహ్రూ సోషలిష్టు విధానాలతో దేశాన్ని నడిపిస్తూ ఉంటే, మొరార్జీ దేశాయ్ దీనిని వ్యతిరేకించారు. ఆయన ఫ్రీఎకానమీ వాది. ఇద్దరి మధ్య విబేధాలు తీవ్రస్తాయికి చేరుకున్నాయి.
అందువల్ల పార్టీ లో ఉన్న నెహ్రూ విధేయులంతా మొరార్జీ ప్రధాని కాకూడదనుకున్నారు. ప్రభుత్వంలో నెహ్రూ విధానాల ప్రకారమే నడవాలనుకున్నారు. పార్లమెంటరీ పార్టీ ఎన్నికలో అంతా శాస్త్రీని సమర్థించారు. ఆయన ప్రధాని అయ్యారు.
అయితే, 1966 జనవరిలో సోవియట్ రష్యాలోని తాస్కెంట్ లో ప్రధాని శాస్త్రి చనిపోయారు. ఇండియాలో మరొక సారి  వారసుడెవరనే ప్రశ్న తలెత్తింది.
ఇలాంటపుడు ఇద్దరు ప్రధాని పదవి రేసులోకి వచ్చారు. ఒకరు కాకలు తీరిన మోరార్జీ దేశాయ్ కాగా, ఇందిరా గాంధీ. సీనియర్ నాయకుడయినా సరే మొరార్జీ దేశాయ్ కి పార్టీలోని ఇతర సీనియర్ సహచరులు మద్దతు లభించలేదు.
అనుభవం లేకపోయినా, ఇందిరా గాంధీ ప్రధాని అయితే, తమ మాట వినవచ్చని పార్టీలోని పెద్ద లంతా ఆమెకు మద్దతిచ్చారు.
ఆమె ప్రధాని అయ్యారు. ఫలితంగా ఇందిరాగాంధీ క్యాబినెట్ లో ఉప ప్రధాని, అర్థిక మంత్రి మొరార్జీ నియమితులయ్యారు. ఆమె తండ్రి  సోషలిస్టు విధానాలనేకొనసాగించాలనుకున్నారు. దీనిని మొరార్జీ వ్యతిరేకిస్తున్నందున, తాను తీసుకోబోయే చర్యలకు మొరార్జీ నుంచి వ్యతిరేకత వస్తుందనిఆమె అనుమానించారు.దీనికి కారణం,  1967 డిసెంబర్ 14 పార్లమెంటులో ప్రసంగిస్తూ బ్యాంకుల జాతీయీకరణ అవసరంలేది మొరార్జీ ప్రకటించి ఉన్నారు.
1969 జూలై లో ఇందిరా గాంధీ ఆర్థిక శాఖను ఆయన దగ్గిర నుంచి తీసేసుకున్నారు.కేవలం ఉప ప్రధానిగా కొనసాగమన్నారు.
ఆర్థిక మంత్రిగా ఇందిరా గాంధీ చేసిన బడ్జెట్ ప్రసంగం చదవండి
తర్వాత ఆమె బ్యాంకుల జాతీయీకరణ మొదలుపెట్టారు.
జూలై 19,1969న Banking Companies (Acquisition and Transfer of Undertakings) Ordinance విడుదల చేసి 50కోట్లరుపాయల డిపాజిట్ లు పైనున్న 14 బ్యాంకులను జాతీయం చేశారు. ఇదే మాత్రం నచ్చని మొరార్జీ క్యాబినెట్ నుంచి తప్పుకున్నారు.
1970-71 బడ్జెట్ ను ఆమె ప్రవేశపెట్టారు.
అపుడే కాంగ్రెస్ చీలిపోయింది. మొరార్జీ కొత్తగా వచ్చిన ఐఎన్ పి (ఒ) లో చేరిపోయారు. తర్వాత 1971 జనవరిలో యశ్వంతరావ్ చవన్ ని ఆర్థిక మంత్రిగా ఇందిరాగాంధీ నియమించారు.
ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/centredploys-tamil-minister-to-douse-anti-hindi-sentiments-in-tamil-nadu/

(ఈ వార్తలు మీకు నచ్చితే షేర్ చేయండి. ఇన్ ఫర్మేటివ్ జర్నలిజానికి చేయూత నీయండి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *