తెలంగాణలో ప్రజల ఛానెల్ గా ముద్ర పడిన వి6 జర్నలిస్టులకు, సంస్థలో పని చేసే ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఈ ఛానెల్ మీద నిన్న మొన్నటి వరకు అధికార పార్టీకి అనుకూలం అన్న ముద్ర ఉన్నది. కానీ ఇటీవల ప్రజల ఛానెల్ గా నడుచుకునే దిశగా సాగుతోంది.
అంతర్గత కుమ్ములాటలతో పెద్ద పెద్ద మీడియా సంస్థలే కుప్పకూలుతున్న ఈ రోజుల్లో V6 NEWS మరోసారి తన పటిష్టతను నిరూపించుకుంది. ఒక నెల బేసిక్ జీతాన్ని ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించింది ఆ సంస్థ యాజమాన్యం.
భారీ ఇంక్రిమెంట్లు ఇచ్చిన కొన్ని నెలలకే బోనస్ ప్రకటించింది. చాలా మీడియా సంస్థల్లో జీతాలే సరిగా ఇవ్వలేనటువంటి టైం లో తమ ఛైర్మన్ వివేక్, సీఈఓ రవి అంకం బోనస్ ప్రకటించడంతో V6 ఉద్యోగులు ఆనందానికి హద్దుల్లేవు.
మీడియా సంస్థలు సంక్షోభంలో ఉన్న టైంలో ఈ రంగంలోకి అడుగుపెట్టి తన దైన ప్రత్యేక ప్రజంటేషన్ తో టాప్ ఛానళ్లలో ఒకటిగా నిలిచింది V6 NEWS. ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వేళ వెనుకా ముందు ఆలోచించకుండా తెలంగాణ వాదాన్ని భుజానేసుకుని ఇప్పటి దాకా అదే ఆత్మగా ముందుకెళ్తోంది ఆ ఛానల్.
న్యూట్రల్ గా ఉండాలన్న ఉద్దేశంతో ఏ పార్టీని మోయలేదు కూడా ఆ చానల్. కారణాలేవైనా ఆ ఛానల్ యాజమని వివేక్ కు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. దీంతో అతను, ఆయన మీడియా సంస్థలు ఢిలా పడిపోతాయని అందరు భావించారు. దానికి భిన్నంగా V6 NEWS, ఆ సంస్థనుంచి వచ్చిన దినపత్రిక వెలుగు రెండింటినీ సక్సెస్ బాటలో నడిపిస్తున్నారు రవి అంకం. తెలంగాణాలో ఆ ఛానల్ అప్పుడు, ఇప్పుడూ టాప్ రేటింగ్ లోనే ఉంది. మొదట్లో వీసిక్స్ లో అంతా జూనియర్లే ఉన్నారన్న భావన ఉండేది. కాని వీసిక్స్ CEO రవి అంకం భిన్నంగా ఆలోచించి సంస్థను జనంలోకి తీసుకుపోవడమే కాకుండా లాభాల్లోకి తెచ్చారు.
అంతే కాకుండా V6 సక్సెస్ ఉత్సాహంతో వెలుగు దిన పత్రికను కూడా ప్రారంభించారు. అతి తక్కువ కాలంలోనే వెలుగు కూడా తెలంగాణ పాఠకుడికి చేరువయింది. మంచి జీతాలు ఇవ్వడమే కాకుండా ప్రతి ఏటా మంచి ఇంక్రిమెంట్ ఇవ్వడంలో కూడా ఇప్పుడు రాష్ట్రంలో V6 మాత్రమే ముందు వరుసలో ఉందని అందరూ ఒప్పుకోవాల్సిందే. వెలుగు ప్రారంభమైన కొన్ని నెలల్లోనే ఆ భారాన్ని పట్టించుకోకుండా భారీ ఇంక్రిమెంట్లు ఇచ్చింది V6. ఇంక్రిమెంట్లు ఇచ్చిన కొన్ని నెలలకే బోనస్ ప్రకటించి మీడియా రంగంలోనే సంచలనం సృష్టించింది V6 NEWS.
ఐదు రాష్ట్రాల్లో నంబర్ ఛానల్ సృష్టించామని చెప్పుకున్న ఒక మీడియా సంస్థ ఇటీవల కొత్త యాజమాన్యం, సీఈఓ కు మధ్య తలెత్తిన వివాదంలో దాని భవిష్యత్తు అయోమయంలో పడిపోయింది. ఇట్లాంటి తరుణంలో 8 ఏళ్ల కిందట జీ.వివేక్ తో ఛానల్ పెట్టించి, ఆ సక్సెస్ తో వెలుగు దినపత్రిక ను ప్రారంభించి రెండింటినీ సక్సెస్ గా నడిపిస్తున్న CEO రవి అంకం ని అందరు అభినందించాల్సిందే. పైగా వివేక్, రవి అంకం జోడీ సక్సెస్ ను ఎంజాయ్ చేయడమే కాకుండా దాన్ని రెండో సారి బోనస్ రూపంలో ఉద్యోగులకు అందించడం కూడా గొప్ప విషయం కాక మరేముంటుంది అంటున్నారు ఉద్యోగులు.