అమరావతి: ఇందిరాగాంధీ స్టేడియంలో వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకార ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కృష్ణా కలెక్టర్, విజయవాడ సీపీ, మున్సిపల్ కమిషనర్ సాయంత్రం ఏర్పాట్లను పరిశీలిస్తు న్నారు.
పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు.
హైదరాబాద్, విశాఖ, చెన్నై మార్గాల్లో వచ్చే వాహనాలు.. కృష్ణా జిల్లా శివారు ప్రాంతాల్లో నిలిపివేస్తారు. ఏఆర్ గ్రౌండ్స్‌లో వీఐపీల కోసం పార్కింగ్ కేటాయించారు. ప్రముఖుల వాహనాల కోసం బిషప్ అజరయ్య స్కూల్, పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో పార్కింగ్ చేయాలని అధికారులు సూచించారు. ఐదు రకాల ఎంట్రీ పాస్‌లు జారీ చేయాలని సీఎస్ ఆదేశించారు.
ఇందిరాగాంధీ స్టేడియంలో 35 వేల మందికి సీట్టింగ్ సామర్థ్యం ఉంది. వేసవి దృష్ట్యా స్టేడియంలో ఏసీలు, కూలర్లు, తాగునీరు ఏర్పాటు చేస్తున్నారు. స్టేడియం వెలుపల ఎల్సీడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.