లాయర్ల కుటుంబాలకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్

న్యాయవాదుల పిల్ల‌ల‌కు కూడా ఆరోగ్య బీమా ప‌థ‌కం వ‌ర్తింపు
ఈ ఏడాది 55,550 మందికి హెల్త్ కార్డులు
న్యాయవాదులకు ఆరోగ్య బీమా పథకంపై మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మీక్ష‌
హైదరాబాద్‌, మే 25 : న‌్యాయ‌వాదుల పిల్ల‌ల‌కు కూడా ఆరోగ్య బీమా ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేస్తున్న‌ట్లు న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు న్యాయ‌వాది, వారి జీవిత భాగ‌స్వామికి మాత్ర‌మే ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేశామ‌ని…. ఇప్పుడు వారి ఇద్ద‌రు పిల్ల‌ల‌కు కూడా దీన్ని వ‌ర్తింప‌జేయాల‌ని తెలంగాణ స్టేట్‌ అడ్వొకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ నిర్ణ‌యం తీసుకుంద‌ని చెప్పారు. న్యాయవాదుల సంక్షేమంపై మ‌ంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శ‌నివారం సచివాలయంలో సమీక్ష జరిపారు.

ఇన్సురెన్స్ ఏజెన్సీల‌తో సంప్ర‌దింపులు జ‌రిపి అతి త‌క్కువ ప్రీమియం కోట్ చేసే, మెరుగైన సేవ‌లు అందించే కంపెనికి అప్ప‌గించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ… న్యాయ‌వాది, వారి జీవిత భాగ‌స్వామితో పాటు ఇద్ద‌రు పిల్ల‌ల‌ను క‌లుపుకుని మొత్తం 55,550 మంది హెల్త్ కార్డుల‌ను జారీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు.
2019-2020 సంవ‌త్స‌రానికి గాను త్వ‌ర‌లోనే హెల్త్ కార్డుల‌ను జారీ చేస్తామ‌న్నారు. గ‌త ఏడాది 18,404 మంది న్యాయ‌వాదుల‌కు హెల్త్ కార్డుల‌ను అందజేశామ‌ని… 945 మంది ఆరోగ్య బీమా ప‌థ‌కం ద్వారా ల‌బ్దిపోందార‌ని, మెడిక్లెయిమ్ కు మొత్తం రూ.5 కోట్లు వెచ్చించామ‌ని పేర్కొన్నారు.
ఈ స‌మావేశంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, న్యాయ శాఖ కార్య‌ద‌ర్శి నిరంజ‌న్ రావు, ట్రస్ట్‌ కార్యదర్శి, న్యాయశాఖ అద‌న‌పు కార్యదర్శి బాచిన రామాంజనేయులు, న్యాయ శాఖ ఉప కార్య‌ద‌ర్శి మ‌న్న‌న్ ఫారూఖీ పాల్గొన్నారు.

3 thoughts on “లాయర్ల కుటుంబాలకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *