వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈమధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలుసుకున్నారు.
సతీసమేతంగా ఆయన హైదరాబాద్ ప్రగతిభవన్ కు వచ్చారు.గవర్నర్ నరసింహన్‌తో భేటీ అనంతరం జగన్ నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లారు. జగన్ ప్రగతి భవన్‌కు రావడం ఇదే తొలిసారి. జగన్ కు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఇతర మంత్రులు ఘనస్వాగతం పలికారు. ఈనెల 30న విజయవాడలో జరుగుతున్న తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని కేసీఆర్‌ను జగన్ ఆహ్వానించారు.
వైఎస్ జగన్ దంపతులకు సీఎం కేసీఆర్ సాదరంగా స్వాగతం పలుకుతూ కేసీఆర్ పుష్పగుచ్చాలు ఇచ్చారు. ఆత్మీయంగా జగన్‌ను ఆలింగనం చేసుకొని కేసీఆర్ అభినందించారు. జగన్‌ను శాలువాతో సత్కరించి.. జగన్‌తో పాటు భార్య వైఎస్ భారతి, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి, ఎంపి మిథున్‌రెడ్డి తదితరులు ఉన్నారు.