టివి9 ఎన్ కౌంటర్ స్పెషలిస్టు రవిప్రకాష్ ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమయింది. ఇపుడాయన పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. పోర్జరీ, నిధుల మళ్లింపు, కంటెంట్ చౌర్యం వంటి ఫిర్యాదులతో ఆయన మీద టివి9 కొత్త యాజమాన్యం ఆయన మీద కేసులు పెట్టింది. వీటిని గురించి విచారించేందుకు పోలీసులు ఆయన కునోటీలు జారీ చేశారు.అయితే, ఆయన గతంలో ఇంటర్వ్యూచేసినఎందరో నేరస్థులలాగానే ఇపుడు రవిప్రకాశ్ కూడా పరారీలో ఉన్నాడు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూహైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన అభ్యర్థనను అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. అత్యవసర విచారణ అవసరం లేదని కోర్టు చెప్పింది. దానితో పాటు ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.