పనిలో 996, పడకలో 669 : అలీబాబా కొత్త ఫార్ములా

చైనాలో జనాభా పడిపోతావుంది. ఇది దేశం మీద బాగా వత్తిడి పెంచుతూ ఉంది. చాలా మంది పిల్లలను కనడానికి ఇష్టపడకపోవడం, చాలా కాలం చైనా లో  వన్ ఆర్ నన్ సంతాన విధానం పాటించడంతో జనాభా పెరుగుదల తగ్గిపోవడం మొదలయింది.

ఈ నేపథ్యంతో ఆలీబాబా ఇ-కామర్స్ సంస్థచీఫ్ జాక్ మా తన ఉద్యోగులకు వివాదాస్పదమయిన సలహాపడేశాడు. దీనిని నెటిజన్లు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు.దుయ్యబట్టారు. ఆయన ఇచ్చిన సలహా ఏమిటో తెలుసా… సంస్థ ఉద్యోగులంతా పడగ్గదిలో 669 ఫార్ములా ఫాలో కావాలన్నారు. 669 అంటే, వారానికి ఆరు రోజులు ఆరుసార్లు సంస్థ ఉద్యోగులు ప్రేమించుకోవాలి అని. ఇప్పటికే జాక్ మా ఉద్యోగులకు 996 ఫార్ములా పెట్టి హింసిస్తున్నారు. 996 అంటే సంస్థలో ఉదయం తొమ్మది నుంచి రాత్రి 9 దాకా వారానికి ఆరు రోజులు పని చేయాలి. అంటే రోజుకు 12 గంటలు వొళ్లు హూనం చేసుకోవాలి. ఆ తర్వాత 669 ఫాలో కావాలి. అంతశక్తి ఉంటుందా అని చాలా మందివాపోతున్నారు.

ప్రతిసంవత్సరం అలీబాబా సంస్థలో మే 10 అలీ డే అని జరుపుతారు. అంటే రోజు సంస్థలో పని చేసే ఉద్యోగుల్లో ప్రమించుకున్నవాళ్లకు సామూహిక వివాహం జరిపిస్తారు. ఆ సందర్భంగా జాక్ మా  ఉపదేశం చేస్తారు. మొన్న అలీడే  సందర్భంగా ఆయన ఉపదేశమిస్తూ వారానికి అరురోజులు, ఆరు సార్లు సెక్స్ లో పాల్గొనాలి. మరి ఫార్ములా ఉన్న 9 అంటే ఏమిటో అర్థం ఆయన చెప్పలేదు. ఆయన కంపెనీ పనినియమం 996 కు రైమ్ కుదిరేలా 669అన్నారనుకోవాలి.అయితే, ఆయన సలహాతో నెట్ లో భూకంపం వచ్చింది. చాలా మంది ఆయనను తీవ్రంగా విమర్శించారు. ఇది సెక్సిస్టు సలహా అని విమర్శించారు.

ఈ సారి అలీ డే రోజు 102 మంది పెళ్లి చేసుకున్నారు. వాళ్లకోసం ఆయన సరదా ఇచ్చిన సలహా ఇది కంపెనీ ఎగ్జిక్యూటివ్ లు చెబుతున్నారు.

జీవితంలో ప్రతికూలాంశాలను విస్మరించి సానుకూల విషయాల మీద శ్రద్ధ పెట్టేందుకు, సంసారంల్ శృంగారం పాత్రను నొక్కిచెప్పేందుకు ఆయన ప్రయత్నించారని అధికారలు చెబుతున్నారు.

మా చైనాలో మొదట ఇంగ్లీష్ టీచర్ గా పని చేసేవారు. 1999 లో ఆయన అలీబాబా సంస్థను ఏర్పాటుచేశారున ఇపుడ చైనాలో అత్యంత సంపన్నుడు.
జాక్ మా సలహా మీద చాలా స్పందన వచ్చింది.

మరొక వ్యక్తి కడపుమంట వెళ్ల గక్కుతూ… 996 ఉద్యోగం చేసి వొళ్లు హూనం చేసుకున్నాక 669 ఫాలో అయేంత ఎనర్జీ ఎక్కడ ఏడ్చి చస్తుందని అన్నారు. (‘Who on earth would have the energy to669 after 996 during work’)

ఈ సామూహిక వివాహం సమయంలో ఆయన ఇచ్చిన సలహా:
‘పెళ్లి పనితీరు సూచిక ఉత్పత్తి చూపించడమే. ఉత్పత్తి జరిగి తీరవలసిందే. ఏమిటీ ఉత్పత్తి, సంతానం,’ అని మా అన్నారు.(The first KPI of marriage is to have results. There must be products. What is the product? Have children.)

‘పెళ్లి ప్రయోజనం సంపద కూడబెట్టుకోవడం కాదు,అలాగే ఇల్లు కొనడం కాదు, కారుకొనడమూ కాదు. ఇద్దరు కలసి సంతానం సృష్టించడమే పెళ్లి ధ్యేయం,’ అని ఆయన వివరించారని డెయిలీ మెయిల్ రాసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *