కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి 44 మీద కర్నూలు సమీపంలోని వెల్దుర్తి వద్ద జరిగిన ప్రమాదంలో 15 మంది చనిపోయారు. ఒక క్రూజర్, వోల్వో బస్సు ఎదరెదురుగా వచ్చి ఢికొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
బైక్‌ను తప్పించబోయి ప్రైవేటు వోల్వో బస్సును క్రూజర్ ఢీకొట్టిందని చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో 15మంది దుర్మరణం చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వెల్దుర్తి క్రాస్‌రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
మృతులంతా గద్వాల జిల్లా శాంతినగరం మండలం రామాపురానికి చెందిన వారని తెలిసింది.
ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశట్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకుటుంబాలకు ప్రగాఢ సాను
భూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం
అందించాలని కర్నూలు జిల్లా ఎస్పీని ఆదేశించారు. మృతదేహాలను వారి స్వస్ధలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశలిచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం
కర్నూలు జిల్లాలో వెల్దుర్తి సమీపంలో హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పలువురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. సంఘటనలో గాయపడి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి అవసరమైన సాయం అందించాల్సిందిగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు.
పెళ్లిచూపుల నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి శ్రీనివాస్ గద్వాల జిల్లా కలెక్టర్ శశాంక తో సంఘటన వివరాలు తెలుసుకున్నారు. సంఘటనలో గాయపడి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి అవసరమైన సాయం అందించాల్సిందిగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ను శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.