మారుతి సుజుకి డీజిల్ కార్లను ఎందుకు బంద్ చేస్తున్నది?

ఏప్రిల్ 2, 2020 నుంచి మారుతి సుజుకి కంపెనీ డీజిల్ కార్ల తయారీని నిలిపి వేస్తూంది. ఇండియాలో ఒక అలవాటుంది. ఈ విషయాన్ని కంపెనీ ఛెయిర్మన్ ఆర్ సి భార్గవ ప్రకటించారు.వచ్చే ఏడాది డిజిల్ కార్ల డిమాండ్ ఇప్పటి లాగే ఉంటే 2020 నుంచి డీజిల్ కార్ల తయారీ నిలిపివేస్తామని ఆయన ప్రకటించారు. అయితే, వచ్చేఏడాది డిజిల్ కార్ల ధరలు కూడా పెరుగుతాయి. ఒక వేళ డిమాండ్ పెరిగి కొంతకాలం డిజిల్ కార్ల ఉత్పత్తి కొనసాగినా ధరలు బాగా పెరుగుతాయి. మారుతి సుజుకి ఇండియాల అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ.ఇలాంటి కంపెనీ నుంచి ఇలాంటి ఇలా నిరుత్సాహపరి చే వార్త రావడం ఆశ్చర్యమే. లోతుగా పరిశీలిస్తే మారుతి నిర్ణయం సబబే అని పిస్తుంది.

మొత్తంగా అమ్ముడుపోతున్న కార్లలో మారుతి సుజుకి డీజిల్ కార్ల సంఖ్య బాగా పడిపోతూ ఉంది. 2015లో ఈ కంపెనీ డిజిల్ కార్ల వాట 40 శాతం ఉంటే ఇపుడిది 23 శాతానికి పడిపోయింది. 2018-19లో ఈ కంపెనీ అమ్మిన డిజిల్ కార్లు కేవలం 4.63 లక్షలు మాత్రమే.

భారతీయులు కార్లు కొనే ముందు చాలా సార్లు ఆలోచిస్తారు. చాలా విషయాల గురించి వాకబు చేస్తారు. అన్నింటిలో ముఖ్యమయింది మైలేజీ ఎంత ఇస్తా ఉంది అనేది. రెండో కారణం, పెట్రోల్ , డిజిల్ ధరల వ్యత్యాసం ఎంత అనేది.

ఈ మధ్య పెట్రోలు, డిజిల్ ధరలు దాదాపు సమానమవుతున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ లో 2015 మే 16న లీటర్ డిజిల్ ధర రు. 59.1 . పెట్రోలు లీటర్ ధర రు.75.45 లుండేది. తేడా రు. 16.35 ఉండింది. మే ఒకటో తేదీన పెట్రోలు ధర లీటరు రు. 77.55 పైసలు. డిజిల్ ధర రు. 72.48 పైసలు. పెట్రోలు ధరలు క్రమబద్దీకరించాక ఈ రెండు ఇంధనాలు ధరలు దాదాపు సమానమవుతున్నాయి. రెండింటి మధ్య తేడా అయిదు రుపాయలు మించడం లేదు. ఈ రెండింటి మధ్య తేడా ఉన్నపుడు డీజిల్ కార్ ధర ఎక్కువయినా కొంటూ వచ్చారు. ఈ  తేడా డిజిల్ ధరలో అదా అవుతూ వచ్చింది.

మారుతి డిజిల్ కార్ ధర పెట్రోల్ కార్ ధర కంటే కనీసం ఒక లక్షరుపాయలు తక్కువగా ఉండేది. ఇపుడు పెట్రోలు డీజిల్ ధరల దాదాపు సమానం కావడంతో డీజిల్ కారకు ఎక్కువ ధర పెట్టేందుకు కస్టమర్లు ఇష్టపడటం లేదు.అందుకే డీజిల్ కార్ల ఉత్పత్తిని 2020, ఏప్రిల్ 1 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ తేదీ ప్రత్యేకత ఏమిటంటే, బిఎస్ -4 ఎమిషన్ ప్రమాణాల ప్రకారం వాహనాలు తయారుచేసేందుకు విధించిన గడువు ఇది.ఆలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి.

BS-IV ప్రమాణాల ప్రకారం మారుతి సుజుకి డిజిల్ వాహానాలను తయారుచేయడానికి అనేక అదనపు విభాగాలు జోడించాలి. ఉదాహరణకు డిజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్స్ ఏర్పాటుచేయాలి, శక్తివంతమయిన కెటలైటిక్ కన్వర్టర్స్ ను వాడాలి,ఇజిఆర్ (ఎగ్జాస్ట్ గ్యాస్ రీ సర్క్యులేషన్ ) వంటి విడిభాగాలను రీడిజైన్ చేయాలి.దీనితో డీజిల్ ఇంజన్ ధర బాగా పెరిగిపోతుంది. ఇంత ఖరీదైన డిజిల్ కార్లు తయారుచేయడం ఏ మాత్రం లాభసాటి కాదు. ముఖ్యంగా చిన్న కార్ల తయారీదారు అయిన మారుతికి అసలు గిట్టుబాటు కాదు.

కొత్త ప్రమాణాల ప్రకారం అంటే BS-IV ప్రమాణాల ప్రకారం కారు తయారు చేశాక స్విఫ్ట్ కారు ధర రు. 12 లక్షల దాకా ఉంటుందని ఒక డీలర్ చెప్పారు.

అందువల్ల డీజిల్ కార్లమీద ఖర్చు పెట్టేకంటే సిఎన్ జి, హైబ్రిడ్, ఎలెక్ట్రిక్ కార్ల తయారీ మీద ద‌ృష్టి కేంద్రీకరించడం మేలని మారుతి సుజుకి యోచిస్తూ ఉంది. ఈ మధ్య మారుతి బాలెనో పెట్రోల్ హైబ్రిడ్ కారును తీసుకువచ్చింది.దీనికి రెస్పాన్స్ బాగా ఉంది. అందువల్ల సియాజ్, ఎర్టిగా, ఎస్ క్రాస్ వంటి డిజిల్ హైబ్రిడ్ కార్లను కూడా తీసేసి పెట్రోల్ హైబ్రిడ్ కార్లనే తయారుచేయాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలిసింది.

హైబ్రిడ్ కార్లను తయారుచేసి మారుతి తన మార్కెట్ షేర్ ను కాపాడుకోవాలనుకుంటున్నది. ఎందుకంటే, ఎన్ని విదేశీ కార్లు ఇండియాలోకి చొరబడినా 50 శాతం మార్కెట్ షేర్ మారుతీదే. కారుకంటే ఇంధనం ధర, మైలేజీ నచ్చితేనే కార్లను కొనే భారతీయులను దృష్టిపెట్టుకున్నది ఒక్క మారుతియే. ఈ రెండింటిని చూపి కార్లను అమ్ముకోవడమే  మారుతి మంత్రం. అది బాగా పనిచేస్తూ ఉంది.అందుకే మారుతి వన్నెతగ్గడమేలేదు.

ఇది కూడ చదవండి…

https://trendingtelugunews.com/it-official-seize-crore-of-cash-from-auto-driver-house-in-benguluru/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *