బెంగుళూరులో ఆటో తోల్తాడు గాని సుబ్రమణి అల్లాటప్ప ఆటో డ్రయివరు కాదు. ఆ విషయం చాలామందికి బుధవారం దాకా తెలియదు.
బుధవారం నాడు సుబ్రమణి ఇంటిమీద ఆదాయపు పన్ను శాఖ అధికారులు రైడ్ చేసి అవాక్కయ్యారు. బెంగుళూరు సంపన్నుల కాలనీ వైట్ ఫీల్డ్ లో (సర్వే నెంబర్ 51, ఇసిసిరోడ్)లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో సుబ్రమణి దాదాపు రెండుకోట్లు పెట్టి ఒక విలా కొన్నాడు. దీనికోసం డబ్బంతా క్యాషే ఇచ్చాడు.ఈ విషయాన్నెవరో ఐటి వాళ్లకు ఉప్పందించారు.
సుబ్రమణి ఇంతవరకు ఒక్కసారి కూడా ఇన్ కమ్ ట్యాక్స్ కట్ట లేదు. ఇలాంటి సుబ్రమణి రెంండుకోట్లు పెట్టి పోష్ జట్టి ద్వారకామయి విల్లాస్ ల్ ఇల్లు కొనడ మేమిటి?
అంతే, ఆయన ఇంటి మీద ఐటి అధికారులు దాడి చేశారు.దాడిగురించి ఐటి అధికారులనుంచి అధికారిక స్టేట్ మెంట్ విడుదల కాకపోయినా, మీడియా రిపోర్టుల ప్రకారం దాదాపు 7.9 కోట్ల రుపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
సుబ్రమణి ఎవరో పొలిటిషన్ కు బినామీ అయిఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. రెండుకోట్లు పెట్టి విలా కొన్నాడని సమాచారం అందగానే సుబ్రమణికి ఐటి అధికారులు నోటీ సు జారీ చేశారు. ఇంత ఖరీదయిన ఇల్లెలాకొన్నావో చెప్పాలని అడిగారు. ఇందులో రహస్య లావాదేవీలేవీ లేవని, తన మీద వస్తున్న ఆరోపణలన్నీ తప్పని, ఈ ఇంటిని లారీ అనే విదేశీ ప్యాసెంజర్ గిఫ్ట్ గా ఇచ్చారని సుబ్రమణి చెబుతున్నాడు.
‘ఒక రోజు బాగా వర్షం వస్తూ ఉంది. ఆమె (విదేశీ పర్యాటకురాలు)ఒక క్యాబ్ ,కనీసం ఒక ఆటోఅయినా వస్తుందని ఎదురుచూస్తూ ఉంది. ఎవీ రాకపోవడంతో ఆమె ఆందోళన చెందుతూ ఉంది. అలాంటపుడు నేను ఆదారి గుండావచ్చాను. వర్షంలో ఎలా ఇంటికి వెళ్లాలో తెలియక సతమతమవతున్న ఆమెను నేను ఇంటి దగ్గిర దిగబెట్టాను. తర్వాత ఒక సారి నా ఆటోను ఆమె చూసింది.అవసరమయిన ఆటో అందుబాటులో ఉంటుందా అని అడిగింది. దారిలో నా కుటుంబం గురించి ,నా ఆర్థిక బాగోగుల గురించి వాకబుచేసింది. నా దరిద్రం చూసి సాయం చూసేందుకు ముందుకు వచ్చింది. నాకే కాదు, ఆమె చాలా మందికి సాయం చేసింది,’ సుబ్రమణి అద్భుతమయిన కథ చెప్పినట్లు న్యూస్ మినిట్ రాసింది.
ఐటి అధికారుల విచారణ లో మరిన్ని ఆసక్తికరమయిన విషయాలు వెల్లడయ్యాయి. సుబ్రమణి అటోలకు పైనాన్స్ కూడా చేస్తుంటాడని, పదివేల రుపాయల దాకా ఆటోలకు అధిక వడ్డీలకు రుణాలిస్తుంటాడని అధికారులు కనుక్కున్నారు.. అంతేనా, ఇంకా చాలా ఉంది. ఇతగాడు భూముల దందా గ్యాంగ్ లో కూడా సభ్యుడని, భూములు అక్రమించి తర్వాత అమ్మేయడం ముఠా చేసే పని అని కూడా అధికారులు చెబుతున్నారు.
మొత్తానికి ఆటో డ్రైవర్ సుబ్రమణి ఈ రోజు ఒక సన్సేషన్
అయితే, ఐటి డిపార్టుమెంటు వాళ్ల తమ శైలిలో తాము ఎంక్వయిరీ చేశారు. సుబ్రమణి ఇంటి మీద ఐటి దాడుల వార్త రాగానే మీడియాలో ఆసక్తికరమయిన కథనాలు వచ్చాయి. సుబ్రమణికి కొంతమంది రాజకీయనాయకులతో సంబంధాలున్నాయని అందులో కూడా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,ఎమ్మెల్యే అరవింద లింబావలి కి సుబ్రమణి బాగా దగ్గిర వాడని మీడియాచెబుతున్నది. అయితే, లింబావలి మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నాడు. నన్నవసరగా ఈ వ్యవహారంలోకి లాగుతున్నారని ఆయన కసురుకుంటున్నాడు.
అధికారులు మాత్రం బినామి ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ యాక్ట్ 1988 కింద సుబ్రమణి మీద కేసు పెట్టారు.