ఢిల్లీ సమీపంలోకి గురుగ్రామ్ లోని ఒక రెస్టారంట్ లో పొట్టిపొట్టి దుస్తులు వేసుకొచ్చిన అమ్మాయిల్ని చూసిన ఒక మిడిల్ క్లాస్ ఆంటికి చిరాకేసింది. వాళ్లు పొట్టి దుస్తులేసుకొచ్చేంది రెచ్చగొట్టేందుకే అంటూ అక్కడున్న ఏడుగురు పురుషుల్ని ఉద్దేశించి ఈ అమ్మాయిల్ని రేపు చేయండనింది.అంతే రభస. ఆమె వ్యాఖ్యలు పెద్ద వివాదాన్ని సృష్టిస్తున్నాయి. ఈ మాటలను తీవ్రంగా పరిగణించిన అమ్మాయిలు ఆమెతో గొడవకు దిగారు. ఈ గొడవను వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలారు.
ఈ వీడియో ఇపుడు వైరలయింది.
గురుగ్రామ్ లోని నుక్కడ్ వాల రెస్టరాంట్లో ఈ సంఘటన జరిగింది. ఇంత దారుణమయిన కామెంట్ చేసినందుకు ముగ్గురమ్మాయిలు ఆమెను పక్కనున్న స్టోర్ దాకా వెంబడించి అక్కడ అటకాయించారు. ఆంటీని నిలదీశారు. అంతహీనంగా మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టబట్టారు. ఆంటి మాత్రం క్షమాపణలు చెప్పేది లేదని మొరాయించింది. ఇంతలో ఆ స్టోర్ కు మరొక మహిళవచ్చింది. ఈ గొడవ తెలుసుకుని అమ్మాయిల పక్షాన నిలబడింది. క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆంటీ ని నిలదీసింది.అంటీ మాత్రం చెక్కెచెదరడం లేదు. మీ కూతుర్లను కంట్రోల్ చేయండని వాళ్ల తల్లిదండ్రులకు సలహా ఇచ్చింది. తన తిట్టిన విషయాన్ని వీడియో తీసుకోవచ్చని దబాయించింది.
pic.twitter.com/dsLJsUvhbb this is so sad and shocking
How can anyone pass such kind of comments on people you don’t know
A middle aged woman telling a young girl that wearing short dresses is a way of her inviting men to rape her— harshu🌙 (@istanSgomez) April 30, 2019
‘నేను స్నేహితులతో కలసి స్నాక్స్ తీసుకుంటున్నపుడు ఈమె నాదగ్గిరకు వచ్చి ఇంత పొట్టిగా దుస్తులు వేసుకున్నావ్ సిగ్గలేదు అనింది. మేం అవాక్కయ్యాం.నీకెందుకు అని ఆమెను ప్రశ్నించాం. దీనితో ఆమె ఇంకా రెచ్చిపోయింది. ఇలాంటి బట్టలు వేసుకువచ్చినందుకు అవకాశం ఉన్నపుడల్లా రేప్ చేయండని అక్కడున్న ఏడుగురు పురుషులకు చెప్పింది. తర్వాత ఆమె వెళ్లిపోతుంటే వెంబడించాం. పక్కునున్న స్టోర్ లో పట్టుకున్నాం. ఆమె వికారాన్ని వీడియోతీశాం,’ అని ఒకఅమ్మాయి ట్విట్టర్ లో పేర్కొంది.
ఇది ఈ వీడియో చూడండి…
తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అమ్మాయిలు హెచ్చరించారు.
This lady thinks girls wearing short dresses encourages men to rape them. . 🙌
Woww🙌
This is 2019 n we r still dealing with such sick minded people..
And its a woman who is trying to degrade another 🙌
And she is nt evn sorry 4 what she said!#auntyjiapologise #Delhi pic.twitter.com/gkrJhf1ENp— a a s h i (@Aashiii8) May 1, 2019
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/why-maruti-suzuki-planning-to-ban-diesel-cars-from-2020-april-1/