బిజెపి అధికార ప్రతినిధి, రాజ్య సభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు మీదకు ఎవరో వ్యక్తి చెప్పు విసిరారు.
బిజెపిన్యూఢిల్లీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తున్నపుడు ఈ సంఘటన జరిగింది.
అయితే, ఇది కాంగ్రెస్ ప్రరేపణతో జరిగిన చర్య అని, దీనిని ఖండించాలని నరసింహారాావు అన్నారు.
#WATCH Delhi: Shoe hurled at BJP MP GVL Narasimha Rao during a press conference at BJP HQs .More details awaited pic.twitter.com/7WKBWbGL3r
— ANI (@ANI) April 18, 2019
భోపాల్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ మీద అభ్యర్థిగా భాజపా తరఫున సాద్వి ప్రజ్ఞాసింగ్‌ను నిలబెడుతున్నసంగతితెలిసింది.ఆమె మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ముద్దాయి. ఆమె పేరు ప్రకటించాక కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యల మీద స్పందించేందుకు నరసింహారావు విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు.
ఆయన కాంగ్రెస్ చర్యలను ఖండిస్తున్న సమయంలో శక్తి భార్గవ్ అనే వ్యక్తి జీవీఎల్‌పై చెప్పు విసిరాడు. అయితే, అక్కడే ఉన్న పార్టీ కార్యాలయ సిబ్బంది అతడిని బయటకు పంపించారు. శక్తి భార్గవ్ వివరాలు ఇంకా అందలేదు.
చెప్పువేసిన వ్యక్తిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ అనుకూలవ్యక్తి చర్య అని ఇలాంటి దాడులకు తాను భయపడనని అన్నారు.
చెప్పు విసరడానికి కారణాలింకా తెలియడం లేదు.
తాజా సమాచారం :
జీవీఎల్‌పై చెప్పు విసిరిన శక్తి భార్గవ జర్నలిస్టు కాదు. ఆయనొక డాక్టర్. కాన్పూర్ కు చెందిన వాడు. పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పోలీసుల విచారణలో శక్తి భార్గవ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనపై కక్షకట్టి ఐటీ దాడులు చేశారని శక్తి భార్గవ వెల్లడించారు. తమ ఆస్పత్రుల్లో సోదాలు చేశారని, కేంద్ర ప్రభుత్వం ధోరణి వల్ల 2018 నుంచి తాను ఆర్థికంగా చాలా నష్టపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ బాధితుడినని కూడా శక్తి భార్గవ చెప్పారు. భార్గవ అవినీతి కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు. అవినీతి గురించి సమాచారం సేకరించి అధికారులకు చెప్పే విజల్ బ్లోయర్ కూడా. అందుకే ఆయనకు కష్టాలు వస్తున్నాయ్.