టాలెస్ట్ అంబేద్కర్ విగ్రహం ఏడవోయింది సారూ…

తెలంగాణ ప్రభుత్వం పెడతానన్న ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం ఎపుడొస్తుందో తెలియదు గాని, ఉన్న విగ్రహాలను కూల్చేస్తున్నారని, ఇది ఆమోదయోగ్యం కాదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితినాయకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.

హైదరాబాద్ నగరంలో 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుచేస్తామని  2016 ఏప్రిల్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిమీద అప్పటి  మంత్రి కడియం శ్రీహరి నాయకత్వంలో ఒకకమిటీ కూడా ఏర్పాటయింది. అయితే,  ఇంతవరకు విగ్రహం అతీగతీ లేదు. అయితే, రెండు రోజుల కిందట హైదరాబాద్ లో ఒక విగ్రహాన్నితీసేసి చెత్త తీసుకుపోయే ట్రక్ లో పడేశారు.కారణం, ఈ విగ్రహాన్ని పంజాగుట్ట జంక్షన్ లో ఏర్పాటుచేయాలనుకున్నారని, దానికి అనుమతి లేదని జిహెచ్ ఎంసి అధికారులు చెబుతున్నారు. విగ్రహాన్ని తొలగిస్తున్నపుడు విరిగిపోయిందని వారు అంటున్నారు.  ఈ విషయాన్ని ప్రశ్నించేందుకు ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ రోజు ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్  దళితుల దైవమయిన అంబేద్కర్ పట్ల అనుసరిస్తున్న విధానాన్ని దుయ్య బట్టారు. ‘ఇప్పటి వరకు 5 ఏండ్లు గడుస్తున్న ఒక్క సారి కూడా అంబెడ్కర్ జయంతి ఉత్సవాలలో కేసీఆర్ పాల్గొనలేదు.దీనిని ప్రశ్నిస్తున్నాం,’ అని ఆయన అన్నారు.

‘అంబెడ్కర్ మాకు దేవుడు తో సమానం.ఎస్సి, ఎస్ టి, బిసిలు ఇలా బ్రతుకుతున్నారు అంటేనే కారణం అంబేడ్కర్.ఆ మహానుభావుడి జయంతి ఉత్సవాలకు కేసీఆర్ రాకపోవడాన్ని మేము ప్రశ్నించాము తప్పు ఏముంది.అన్యాయం జరిగినపుడు ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది,’ అని కృష్ణ మాదిగ అన్నారు.

హైదరాబాద్ లో  అంబెడ్కర్ విగ్రహం విరగగొట్టడాన్ని నిరసిస్తూ మేము ధర్నా చేస్తాము అంటే ధర్నా కు పర్మిషన్ ఇవ్వడం లేదని చెబుతూ  ఉద్దేశ్య పూర్వకంగా దళితులను అవమానిస్తున్నారని ఆయన విమర్శించారు.

టిఆర్ ఎస్  పార్టీ అధ్యక్షుడి గా కూడా కేసీఆర్ ఎప్పుడు అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనలేదు. దీనికి ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలుపుతాం. ఎర్రవెల్లి లో ఉన్న అంబేద్కర్ విగ్రహం కూడా కేసీఆర్ కనీసం పూల దండ వేయలేదు.దీనికి  నిరసన తెలుపుతాం అంటే హౌజ్ అరెస్ట్ చేయడం దారుణం అని ఆయన అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఎంఆర్ పిఎస్  కీలక పాత్ర పోషించింది.ఉద్యమం నుండి ప్రభుత్వం ఏర్పడే వరకు ఎంఆర్ పిఎస్ అండగా ఉందని చెబుతూ ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తాం అంటే పద్ధతి కాదు, దానిని ఒప్పుకోం అని ఆయన అన్నారు..


ప్రజాస్వామ్య బద్దంగా పోరాటం చేసే వాళ్ళను శత్రువు లు లాగా చూడకండని మేము చేసే పోరాటాలు అన్ని ప్రజల కోసమేనని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.

హౌస్ అరెస్టును ఖండించిన పిసిసి చీఫ్ ఉత్తమ్

మంద కృష్ణ హౌస్ అరెస్టును తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు.
నాయకుడు మందకృష్ణ మాదిగ ధర్నాకు ప్రయత్నిస్తే గృహ నిర్బంధం ఏమిటని ప్రశ్నించారు. బుధవారంనాడుగాంధీ భవన్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి మీద కేసు పెట్టిన విషయం ప్రస్తావిస్తూ ఆయన ఇంటికి వచ్చి పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆయన అన్నారు. ఇదంతా కూడా రాజకీయంగా కక్షసాధించేందుకు ప్రయత్నించడమే నని వ్యాఖ్యానిస్తూ విశ్వేశ్వరెడ్డికి కాంగ్రెస్ అండగా ఉంటుందని, దీనిని న్యాయపరంగా ఎదుర్కొంటామని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *