ఏపీ సర్కార్ గుడ్ న్యూస్: సాకారమైన కర్నూల్ ప్రజల చిరకాల కోరిక

కర్నూలు పశ్చిమ ప్రాంత వాసులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఎంతగానో ఎదురు చూస్తున్న ఆర్ డి ఎస్ ప్రాజెక్టు విషయంలో మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు ద్వారా కర్నూలు పశ్చిమ వాసుల సాగు, తాగునీటి కష్టాలు గట్టెక్కనున్నాయి. ఈ ప్రాజెక్టు రాకతో ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆ ప్రాంతానికి భగీరధుడు అయ్యారు అంటున్నారు ప్రజలు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరింత సమాచారం కింద ఉంది చదవండి.

ఆర్డీఎస్ ప్రాజెక్టు వివరాలు…

ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) కర్నూలు వాసుల చిరకాల కోరిక. ఎందుకంటే ఈ ప్రాజెక్టు ద్వారా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి 4 టిఎంసి నీటిని తరలించేందుకు 122 కిలోమీటర్ల కాల్వ ద్వారా ఆయకట్టుకు, తాగునీటికి నీటిని విడుదల చేస్తారు. ఈ విధంగా సుమారు 40 వేల ఎకరాలకు సాగు నీరు, దాదాపు 70 గ్రామాలకు తాగు నీటి సమస్య తీరబోతుంది.

ఆర్డీఎస్ నీటిని మూడు జలాశయాల్లో నింపుతారు. అందులో రెండు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో (కోటేకల్, చిన్నమ్మరివీడు) ఏర్పాటు చేయనున్నారు. “ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం అక్షరాలా రూ.1985,42,30,000 (పంతొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల నలభై రెండు లక్షల ముప్పై వేల రూపాయలు) ఖర్చు పెట్టనుంది”. ఆర్ధిక శాఖ ఆమోదించిన ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం అధికారిక జిఓ జారీ చేసింది. ఆ జిఓ పత్రాన్ని కింద చూడవచ్చు.

2019ICAD_RT76.PDF (2)

ప్రాజెక్టు సాధనకై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కృషి

మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి రాజకీయ వారసుడిగా ఆయన కొడుకు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2014 లో ఎమ్మిగనూరు నుండి టీడీపీ నుండి పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైసీపీకి కంచుకోటగా ఉన్న కర్నూలులో ప్రత్యర్థుల పోటీని గట్టిగా ఎదుర్కొని నిలబడ్డారు. ప్రజలు తనకు ఇచ్చిన మద్దతును నిలబెట్టుకునేందుకు, పార్టీని మరింత బలోపేతం చేయడానికి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

వీటితో పాటు కర్నూలు పశ్చిమ వాసుల చిరకాల కోరిక అయిన ఆర్డీఎస్ ప్రాజెక్టు కోసం ఆయన అధిష్టానంపై బాగా ఒత్తిడి తెచ్చి చివరికి అది సాధించారు అంటున్నారు సన్నిహతులు. ఎమ్మిగనూరు వాసులు తమ ఎమ్మెల్యేని ప్రశంసలతో ముంచెత్తున్నారు. మా ప్రాంత భగీరధుడు అని కొనియాడుతుండటం విశేషం. త్వరలోనే ఈ ప్రాజెక్టు శంకుస్థాపన ఏపీ సీఎం నారాచంద్రబాబు నాయుడు చేతులు మీదుగా జరిపించడానికి బీవీ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *