బ్రేకింగ్ న్యూస్ : సూర్యాపేటలో పోలీసు కార్ చోరీ

సూర్యాపేట జిల్లాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. జనాలను, జనాల మాన ప్రాణాలను రక్షిస్తుంటారు పోలీసులు. అందుకోసం శక్తివంచన లేకుండా రాత్రింబవళ్లు పనిచేస్తారు. మరి అలాంటి పోలీసు కారునే దుండగులు ఎత్తుకుపోయారు. వివరాలు చదవండి.
సూర్యాపేటలో పోలీస్ కారు చోరీకి గురైంది. సూర్యాపేట రూరల్ సీఐ వినియోగిస్తున్న ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు చెందిన వాహనాన్ని దుండగులు అపహరించారు. ఓ షాపింగ్ కాంప్లెక్స్ ముందు సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి కారు పార్క్ చేసి లోపలికి వెళ్లగా దొంగలు అపహరించారు. ఆసమయంలో సీఐ గన్ మెన్, డ్రైవర్ కూడా కాంప్లెక్స్ లోనికి వెళ్లారు. కారు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
సూర్యాపేట జిల్లా ఎస్పీ ప్రకాశ్ జాదవ్ సిఐ కార్యాలయానికి చేరుకుని సంఘటనపై ఆరా తీశారు. పోలీసు కారును దొంగలు ఎత్తుకపోయిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *