మోత్కుపల్లి దాడి ప్రారంభమయిందా?

నిన్న హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద విలపించి, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి మీద  దాడికి దిగిన తెలంగాణ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఇక తిరుగుబాటు శంఖారావం పూరిస్తాడని అనుకున్నారు. మంచి నోరు వాగ్దాటి ఉన్న నాయకుడు, దానికి తోడు చాలా సీనియర్ కాబట్టి ఆయన దాడి అన్ని ఆధారాలతో పక్కాగా, తీవ్రంగా ఉంటుందనుకున్నారు. నిన్నటి సంఘటన తర్వాత పార్టీ తెలంగాణ  అధ్యక్షుడు ఎల్ రమణ మోత్కుపల్లిని పార్టీ నుంచి బహిష్కరించారు. తలపడేందుకు తాము సిద్ధమేనన్నట్లు ప్రకటించారు.

ఈ రోజు ఒక మోత్కుపల్లి ఒక పాత ఉత్తర్వుల కాపిని బయటపెట్టారు.1995లో చంద్రబాబు తో సహా మరో నలుగురిని తెలుగు దేశం పార్టి నుండి సస్పెండ్ చేస్తూ  నాటి స్పీకర్ కు ఎన్టీఆర్ రాసిన లేఖ ను మోత్కుపల్లి నర్సింహులు విడుదల చేశారు.

ఈ లేఖతో  మోత్కుపల్లి చెప్పదల్చుకున్నదేముంది? ఇదంతా పాత కథ. ఈకథ జరిగిన తర్వాత కాలంచాలా ముందుకువెళ్లింది. చంద్రబాబును వెన్నుపోటు దారుడు అని అంటూ ఎన్నికల క్యాంపెయిన్లు నడిచాయి. అయినా సరే, 2014 ఆంధ్రలో ప్రజలు టిడిపి గెలిపించారు. తెలంగాణలో పార్టీకి గౌరవప్రదమయిన స్థానమే ఇచ్చారు. ఆంధ్రా పార్టీఅని తిరమేయలే. ఆంధ్రలో కాంగ్రెస్ లో  లాగా టిడిపి తెలంగాణలో దివాళా తీయలే. ఇలాంటి పార్టీ మీద దాడిజరపాలంటే, మోత్కుపల్లి చాలా పదునైన ఆయుధాలు ధరించాలి, ఆయన దగ్గిర అలాంటి ఆయుధాలు ఉన్నాయా? అనుమానమే. ఆయన దాడి తుస్సుమంటే, ఇతర పార్టీల వాళ్లు టికెట్ కూడా ఇవ్వరేమో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *