మాజీ మంత్రి , నిన్నటి దాకా టిడిపి సీనియర్ నాయకుడు అయిన మోత్కుపల్లి నరసింహులు , తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి మీద తీవ్రంగా దాడి చేశారు. అనేక అవినీతి ఆరోపణలు చేశారు. రాజ్యసభ టికెట్ ఇచ్చేందుకు వందకోట్లు తీసుకున్నాడని ఆరోపించారు. మొత్తంగా చంద్రబాబు అంతటి రాజకీయ దుర్మార్గుడు లేడని అన్నారు. ఈ రోజు విలేకరుల సమావేశంలో ఆయన ఈ విమర్శలు చేశారు. ఇది ఆయన మాటల్లోనే….
చంద్రబాబు నాయుడు గారు నిన్న నాగొంతు కొశేషారు.
గతంలో చంద్రబాబు గారు ఎన్టీఆర్ గొంతు కోసినట్లే నా గొంతు కోశారు.ఎందుకంటే నెను ఎన్టీఆర్ శిష్యుణ్ణి అయినందుకే.
ఉరిశిక్ష వేసేముందు అయిన చివరి కోరిక ఏంటి అని అడుగుతారు కానీ ఆయన నన్ను ఎం అడగలేదు ఎందుకంటే ఆయన ప్రజా సొమ్ము దోసుకోవడానికి మాత్రమే సమయం ఉంది మిగతా వాటికి సమయం లేదు ఆయనకు
గతంలోనే 1995 లో ఎన్టీఆర్ చంద్రబాబు ను సస్పెండ్ చేశాడు దానికి ఈ లేఖనే సాక్ష్యం.ఎన్టీఆర్ ను నమ్మించి మోసం చేశావ్. నువ్ పార్టీ పెట్టినప్పుడు ఎక్కడ పన్నావ్, అప్పుడు నువ్ కాంగ్రెస్ లో ఉన్నావు. బిడ్డను ఇచ్చినందుకు నువ్ మోసం చేశావ్.నువ్ నమ్మకద్రోహివి అని ఎన్టీఆర్ గతంలోనే చెప్పారు.
పేదలను మోసం చేసిన వ్యక్తుల్లో నువ్ మొదటి వ్యక్తి.
నీ వల్ల అనేక మంది చనిపోయారు , మొన్నటికి మొన్న ముద్దుకృష్ణమ నాయుడు చనిపోయాడు ఆయన ఎన్టీఆర్ శిష్యుడిగా మంచి పేరు ఉంది. కానీ నువ్ చేసిన నీచపు రాజకీయాల వలన ఆయన మనోవేదనకు చెంది చనిపోయాడు.
ని అంత రాజకీయ దుర్మార్గుడు ఎవ్వడు లేడు. నిన్ను ఎం అడిగాను పదవులు ఎప్పుడు అడిగాను. ఇది ఆడిగానీవు అని నిరూపించు నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను.
ఎన్టీఆర్ నమ్మక ద్రోహివి. గతంలో ఎన్టీఆర్ విడుదల చేసిన క్యాసెట్ ఉంది. నిన్ను తిడితే తట్టుకోలేని వ్యక్తివి ఏ కులం వారు తిడితే వారితోటి తిట్టిపిస్తావ్ నిది ఎం నీతి. ఇదేనా నువ్ ఇచ్చే మర్యాద.
రాజ్యసభ సిటు ఇస్తాను అని మోసం చేశావ్. నీ కులపొల్లాకు ఇచ్చుకున్నాడు.
దసరా రోజు గవర్నర్ పదవి డిక్లేర్ అయింది ఆయిన నాకు తెలుసు రాని పదవిని ఇస్తా అని ఆశాచుపావ్.
తెలుగుదేశం పార్టీ నీది కాదు జెండా నీది కాదు నువ్ దొంగలాగా జెండా ను ఎత్తుకుపోయావ్
నీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ లాగా ,జగన్ లాగా కేసీఆర్ లాగా జెండా పార్టీ పెట్టుకో నువ్ మొగోడివి అయితే.నివి పిరికి పందవు. నీకు దమ్ము ధైర్యం లేని దద్దమ్మవు.
కేసీఆర్ ప్రభుత్వం ను కూల్చాలి అని చూసిన దుర్మార్గుడివి నీవు
నన్ను నీ అవసరాల కోసం వాడుకున్నావ్,అర్ధరాత్రి ఎన్టీఆర్ను చంపినావు.
నువ్ నీ దగ్గర ఉన్న దొంగలు ఇద్దరు పట్టపగలు ఇద్దరు దొంగలాగా దొరికారు.
నెల ముందు తొడకొట్టిన నీవు ఎందుకు రాత్రికి రాత్రే అమరావతి పరిపోయినవు ఎందుకు పోయావ్.
హుటాహుటిన ఢిల్లీ కి వెళ్లి బీజేపీ వాళ్ళ కళ్ళు మొక్కవ్. అప్పుడు కేసీఆర్ నిన్ను క్షమించాడు. రేవంత్ రెడ్డి ని పట్టుకొని మాలాంటి వారిని దూరం పెట్టడం తగునా నీకు.
ప్రజల సొమ్మును వృధా చేసి తట్టబుట్ట సదురుకొని పారిపోయావ్.
నీవా మాదిగ జాతికి న్యాయం చేసేది, నువ్వా మాదిగల కోసం పోరాటం చేసేది. ఓటుకి నోటు లో దొంగల దొరికిన వ్యక్తి ని ఎందుకు సహించడం. రేవంత్ రెడ్డి ను ఎందుకు పార్టీ నుండి సస్పెండ్ చెయ్యలేదు? ఎందుకంటే నేను మాదిగ, అణగారిన వర్గానికి చెందిన నాయకుడిని కనుక.
ఓటుకు నోటు కేస్ లో నిన్ను దొంగను చేసిన వ్యక్తిని కేసీఆర్ లాంటి వారి పై నోరు పారేసుకోవడానికి వాడుకున్నావ్.రేవంత్ రెడ్డిని, నిన్ను- ఇద్దరిని తెలంగాణ ప్రజలు నిన్ను ఎప్పుడో మర్చిపోయారు.
ఆంధ్రప్రదేశ్ లో కూడా నిన్ను ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు
ఆంధ్రప్రదేశ్ హోదాకోసం కలవలేదు మోదీని ,కేసీఆర్ పెట్టిన కేస్ కోసం కాళ్ళు మొక్కిన దొంగవి.
నువ్ ఒక్క చవటవి , ఒక్క బ్రోకర్ హౌస్ నడిపే వ్యక్తివి.
ఇక్కడ పార్టీని మొత్తం నాశనం చేశావు. నీవల్ల ఇక్కడ ఒరిగేది ఏమి లేదు. హైదరాబాద్ జిహెచ్ ఎంసి లో ప్రచారం చేస్తే డిపాజిట్ కూాడా రాలేదు.నీ మొహం చూసి ఓట్లు వేసేరోజు పోయింది.
నీమీద మన్నువడా, నీవు పాపిస్టివి
మోడీకి కూడా అన్యాయం చేస్తివి. కేస్ కోసం మోడీ కాళ్ళు మొక్కుతివి. హోదాను పక్కద్రోవ పెడితివి.
పెద్దనోట్ల రద్దు చైర్మన్ ఎవ్వరు?
హోదవద్దు అన్నది ఎవ్వరు? నీవు కాదా? ప్రత్యేక హోదా పాసిపోయిన్ అన్నం అంటివి.
నువు లేకపోయిన జగన్ తెస్తాడు ప్రత్యేక హోదా .నీవల్ల ఏమి కాదు, ఇంకా పవన్ కళ్యాణ్, కమ్యూనిస్టు పార్టీ వారు తెస్తారు.
ఎన్నికల సమయంలో డబ్బులు ఖర్చు పెట్టేదానికి తెరలేపింది చంద్రబాబు నాయుడు. ఈయన వల్లనే ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరిగింది.
రాబోయేకాలంలో నీకు అధికారం రాదు, నిన్ను రాజకీయంగా బొంద పెడతారు.ఎంత సేపు జగన్ తిడుతావ్, నువ్వు సంసారి అయినట్లు.
అన్ని దివాళా తీస్తే ఈయన హెరిటేజ్ మాత్రం లాభలలో నడుస్తుంది ఇదెక్కడి న్యాయం?
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను కోరుతున్న వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ను ఓడించాలి.నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని ఏం కోరుకోలేదు కానీ కొద్దిరోజుల్లో మెట్ల ద్వారా కొండ ఎక్కుతాను, ఆయనను ఓడించడానికి.
ఇన్ని రోజులు ఆయనకు సపోర్ట్ చేసినందుకు నన్ను క్షమిచండి.
ఆయనకు ఇన్ని రోజులు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కోసం అని పనిచేశాను.
ఏ పదవి లేకున్నా ఆయన పక్కన ఉండడం నా త్యాగం కాదా….
కనీసం మీడియా వాళ్లకు కూడా సమయం ఇవ్వడు.
దళితులు అంటే చంద్రబాబు కు చిన్నచూపు.
నీ వల్ల మొత్తం వ్యవస్థకు ముప్పు వచ్చే అవకాశం ఉంది
రాబోయే ఎన్నికలలో అన్ని వర్గాల వారు ఆయాయను ఓడించాలి.
ఏ పార్టీలో చేరకపోయిన బ్రతకమా…. ఈయన బ్యాచ్ వల్ల ఇండిపెండెంట్ పోటీచేసి గెలిచాను.
ఆయన 7,8 సార్లో గెలిచారు. నేను కూడా ఆలేరు ప్రజల దయవల్ల 6 సార్లు గెలిచాను.
నాకు చంద్రబాబు వల్ల భయముంది నన్ను ఎం చేస్తాడో అని
పాపం ఆయనకు ఎవ్వరు కుదిర్చారో ఆ సంబంధం ఎన్టీఆర్ అల్లుడు అయ్యాడు.
తెలంగాణ లో టిడిపి అంతరించిపోయింది.
రేవంత్ రెడ్డి టిడిపిని కాంగ్రెస్ లో కలపాలి అని చూస్తుండు అప్పుడు నేను టీఆరెస్ తో మనం పోవాలి అని చెప్పాను. ఎన్టీఆర్ కాంగ్రెస్ వ్యతిరేకంగా టిడిపిని పెట్టాడు.
చంద్రబాబు నాయుడు గారు గుర్తుకు పెట్టుకో, నర్సింహులు విషయం లో తప్పుచేసిన ఒప్పుకో.
పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు పోయాడా.. చంద్రబాబు ఇంటికి పవన్ పోయిండా. పోతివి పవన్ కళ్యాణ్ కాళ్ళు మొక్కుతివి.
చంద్రబాబు మీద సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా .
ఆయన మీద 29 కేస్ లు ఉన్నాయి.
50 సార్లు పోన్ చేసి నాకు సపోర్ట్ చేయి అంటే ని వెంట ఉన్నాను.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో డబ్బు లేకుండా ఎం పనికాదు.
రోజూ ఆయన ఓవరో ఒక్కరిని బలి చెయ్యకపోతే నిద్రపోడు.
నా భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుంది
రాజ్యసభ సభ్యుడు గా పదవి ఇచ్చినందుకు 100 కోట్లు తీసుకున్నాడు.
(బ్యానర్ ఫోటో, సాక్షి సౌజన్యం)