టిఆర్ఎస్ కార్పొరేటర్ భర్తను ఈమె ఎలా కొట్టిందంటే? (వీడియో)

ఖమ్మం పట్టణంలో అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్తపై స్థానిక మహిళ దాడి చేసింది. చెప్పు తీసుకుని కార్పొరేటర్ భర్తను పొల్లు పొల్లుగా కొట్టింది. కడుపు మండిన ఆ మహిళ తనకు అన్యాయం చేస్తారా అంటూ గట్టిగా నిలదీసింది. వివరాలు చదవండి. వీడియో చూడండి.

ఖమ్మం నగరంలో మహిళ కార్పొరేటర్ శశికళ భర్త పోట్ల వీరేందర్ పై స్థానిక మహిళ దాడి చేశారు. ఆ మహిళకు చెందిన ఇంటి స్థలంలో ప్రహరి గోడ కూలగొట్టారు. దీంతో ఆ ఘటనకు మహిళా కార్పొరేటర్ భర్తే కారణమని ఆ మహిళ కోపంతో ఆయన పై దాడి చేసింది. ఈ దాడి చేస్తున్న సమయంలో స్థానికులు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పైన వైరల్ వీడియో ఉంది చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *