రాజధానికి సమీపంలో చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారులో సర్వే నంబరు 647లో కాంగ్రెస్ నేత అనుముల రేవంత్‌రెడ్డి భార్య గీతారెడ్డి పేరిట 6.18 ఎకరాల భూమి ఉంది.
రైతుబంధు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఈ-పాస్ పుస్తకాన్ని, పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తుండటంతో గురువారం ఆమె చౌటుప్పల్‌కు వచ్చారు. కొత్త పాసు పుస్తకాన్ని తీసుకొని పంట పెట్టుబడి సాయం కింద తనకు మంజూరైన రూ.25,800లను తిరిగి ప్రభుత్వానికి అందజేశారు. మండల వ్యవసాయాధికారిణి అనురాధ, ఉపతహసీల్దార్ మమతకు అందుకున్నారు