పెట్రలు డీజిల్ ధరలు పెరగడం మీద మహిళా కాంగ్రెస్ కన్నెర్ర

మోదీ  ప్రభుత్వం పెట్రోలు ధరలు పెంచి సామాన్యుని నడ్డి విరుస్తూ  ఉందని తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పెరిగిన ధరలకు నిరసనగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద నాయకత్వంలో ధర్నాలు, ప్రదర్శనలు మొదలయ్యాయి.

ఈరోజు  కరీంనగర్ లో జరిగిన నిరసన కార్యక్రమానికి శారద స్వయంగా నాయకత్వం వహించారు. దేశాన్ని మోదీ వెనక్కు తీసుకెళ్తున్నారని చెప్పేందుకు ఎద్దుల బండ్ల మీద ర్యాలీ నిర్వహించారు. వందలాది మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడానికి నిరసనగా నినాదాలు చేస్తూ జాయింట్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. జాయింట్ కలెక్టర్కు ఒక వినతిప్రతం సమర్పించారు. పెట్రోలు డీజిల్ ధరలను తగ్గించకపోతే,  ఆందోళన తీవ్రతరం చేస్తామని శారద హెచ్చరించారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *