తిరుమల పెద్ద అయ్యగార్లకు పుట్టా సుధాకర్ యాదవ్ షాక్

టిటిడి పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 65 ఏళ్లు నిండిన అయ్యగార్లను సాగనంపాలని టిటిడి పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని కూడా ప్రకటించింది. టిటిడి కీలక నిర్ణయంతో తిరుమల దేవస్థానంలో సుదీర్ఘకాలంగా ప్రధాన అర్చకులుగా వెలుగొందుతున్న నలుగురు అయ్యగార్లు రిటైర్ మెంట్ తీసుకోవాల్సిన తప్పని సరి పరిస్థితి నెలకొంది.

పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన తొలి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమేవేశంలో సీనియర్ అర్చకులకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. టిటిడి నిర్ణయంతో నలుగురు ప్రధాన అర్చుకులు పదవులు కోల్పోనన్నారు. ఆ నలుగురు వీరే.

రమణ దీక్షితులు,

నరసింహ దీక్షితులు,

శ్రీనివాస దీక్షితులు,

నారాయణ దీక్షితులు.

టిటిడి నిర్ణయం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ నలుగురు ప్రధాన అర్చకులు అందరూ మిరాశి వంశానికి చెందిన వారేనని టిటిడి వర్గాలు చెబుతున్నాయి.

అయితే టిటిడి తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ప్రభుత్వం హిందూ మతం మీద దాడి చేస్తున్నట్లుగా అనిపిస్తోందని మండిపడ్డారు. క్రిస్టియన్, ముస్లిం మతాల విషయంలో చర్యలు తీసుకునే దమ్ము ఉందా అని రమణ దీక్షితులు ప్రశ్నించారు. అర్చక వ్యవస్థలో టిటిడి పాలక మండలి జోక్యం ఉండకూడదన్నారు. ఇప్పటికే ఈ విషయంలో కోర్టు తీర్పులు కూడా ఉన్నాయన్నారు.

అయితే రమణ దీక్షితులు నిన్న కూడా పరుశమైన భాషలో టిటిడి పెద్దలపై మండిపడ్డారు. పుట్టా సుధాకర్ యాదవ్ ను ఉద్దేశించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. అన్యమతస్థులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారం కల్పించారంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన తొలి పాలక మండలి సమావేశంలో రమణ దీక్షితులు మీద వేటు వేస్తూ టిటిడి కఠినమైన నిర్ణయం తీసుకుంది.

మరి ఈ పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో ఎటు దారి తీస్తాయోనన్న చర్చ మొదలైంది. గతం నుంచీ పుట్టా సుధాకర్ యాదవ్ నియామకంపై పెద్ద ఎత్తున కొందరు హిందూ మత ప్రముఖుల పేరుతో విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా రమణదీక్షితులు మీద వేటుతో పుట్టు సుధాకర్ యాదవ్ తన మార్కు పాలన మొదలు పెట్టారన్న ప్రచారం షురూ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *