క్రిష్టియన్ వివాదంలో చిక్కుకున్న పాయకరావు పేట ఎమ్మెల్యేని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నుంచి తొలగించారు. ఈ మేరకుఈ రోజు ఉత్తరువులు వెలువడ్డాయి.గతవారంలో రాష్ట్ర ప్రభుత్వం టిటిడి బోర్డులో ఆమెను సభ్యురాలిని చేసింది. అయితే, ఆమె క్రిష్టియన్ అని బోర్డుకు ఎలా నియమిస్తారని వివాదం మొదలయింది. తాను క్రిష్టియన్ ను అని, ఎపుడై బైబిల్ తో ఉంటానని ఆమెయే చెప్పిన వీడియో హల్ చల్ చేసింది. దీనితో హిందూ సంస్థలు ఆమెను తొలగించాలని పట్టుబట్టాయి. తర్వాత ఆమె యే స్వయంగా తనని బోర్డు నుంచి తప్పించాలని ముఖ్యమంత్రికి లేఖ రాసింది. ఇపుడు ప్రభుత్వం ఆమెను తొలగిస్తూ జివొ విడుదల చేసింది.