ఆమె ఒక యాంకర్. సినిమాల్లో పనిచేయాలన్న కసితో ఉన్న యువతి. కానీ ఆమె గత కొంతకాలంగా తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆడవాళ్లకు రక్షణ లేదని, వాళ్లకు న్యాయం చేయాలని ఆమె పట్టువీడని పోరాటం చేస్తున్నారు. అయితే ఆమె అర్ధనగ్న ప్రదర్శన చేసి వివాదం రేపింది. తర్వాత ఆమె ఆందోళనలో న్యాయం ఉందని సమాజంలో ఆమెకు ఇప్పుడిప్పుడే మద్దతు పెరుగుతూ ఉన్నది.
ఈ తరుణంలో ఆమె ఉన్నఫలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన స్వరంతో విమర్శలు గుప్పించింది. పవన్ తల్లిని దూషించింది. పవన్ ను కూడా బూతు పదజాలంతో విమర్శించింది. ఆమె ఏమన్నదో కింద వీడియోలో చూద్దాం.
తెలుగు నేల మీద లక్షలాది మంది ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ సొంతం. ఆయన ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో యాక్టీవ్ అవుతున్నారు. ఈ తరుణంలో శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ తోపాటు, ఆయన తల్లిని కూడా ధూషించడంతో ఫ్యాన్స్ కు కాక పుట్టింది. ఇక కొందరు ఫ్యాన్స్ రంగంలోకి దిగి శ్రీరెడ్డి కి శ్రద్దాంజలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు షురూ చేశారు. ఆ పోస్టులు వైరల్ అవుతున్నాయి.
అయితే అదే పనిగా శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ మీద సంబంధం ఉన్నా, లేకపోయినా పరుషమైన, బూతులతో కూడిన విమర్శలు చేయడంతో పవన్ ఫ్యాన్స్ తట్టుకోలేక వాళ్ల స్థాయిలో వాళ్లు రెస్పాన్డ్ అవుతున్నారని టాక్ నడుస్తోంది. మరి శ్రీరెడ్డి, పవన్ ఫ్యాన్స్ పంచాయితి ఎప్పటికి పరిష్కారమవుతుందో చూడాలి.