ఈ రైలు కంపార్టమెంటులో 8 ఏళ్ల చిన్నిపిల్లలు ఉన్నారు. మీ వలన వారికి రక్షణ లేదు, అపాయం ఉంది.. అంటూ బీజేపీ లీడర్ ను ముంబాయి లోకల్ రైలు నుంచి జనం గెంటిపారేశారు. పెద్ద పెట్టున జనాలు బాహర్ నిఖాలో అని నినాదాలు చేసి బిజెపి నేతలకు చెమటలు పట్టించారు. ఆసిఫా దారుణ హత్య నేపథ్యంలో దేశవ్యాప్తంగా బిజెపి నేతలను జనాలు అసహ్యించుకుంటున్నారనడానికి ఈ ఘటన ప్రత్యక్ష నిదర్శనం అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియో వాట్సాప్, ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయితున్నది. కర్ణాటక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కర్ణాటక జనాలకు చేరే వరకు షేర్ చేయండి అంటూ ట్యాగ్ లైన్లు కూడా ఇస్తున్నారు. ముంబై జనాలు బిజెపి మీద ఎంత కసిగా ఉన్నారో తెలియాలంటే ఈ వీడియో చూడండి.