ప్రజాగ్రహం ముందు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు నిలబడవు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఆగలేవు. తుపాకులు ఏమీ చేయలేవు. బాడీగార్డులు అడ్డుకోలేరు. ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరసన తెలపాలనుకుంటే ఇవేవీ అడ్డు కాదు.
ఉత్తరప్రదేశ్ లో కూడా అదే జరిగింది. ఉత్తర ప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాద్ పెద్ద కాన్వాయ్ తో పదుల సంఖ్యలో బాడీగార్డులతో రయ్ రయ్ అంటూ రోడ్డు మీద పోతున్నాడు. కానీ జనాలు ఆ కాన్వాయ్ ని అడ్డుకుని నిరసన తెలిపారు. వారిని రోడ్డు మీద నుంచి వెళ్లగొట్టేందుకు సిఎం సిఎం అంగరక్షకులు ఎంతగా శ్రమించారో పైన వీడియో కింద ఉంది చూడండి.
అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే యుపి ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నది. మొన్నటికి మొన్న జరిగిన రెండు ఎంపి సీట్లలో ఆ పార్టీ పరాభవం చవిచూసింది.