కేసిఆర్ బెంగాల్ టూర్ గుట్టు విప్పిన రేవంత్ (వీడియో)

తెలంగాణ సిఎం కేసిఆర్ పశ్చిమ బెంగాల్ టూర్ లోగుట్టును కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విప్పి చెప్పారు. కేసిఆర్ కోల్ కత్తా వెళ్లింది ఫెడరల్ ఫ్రంట్ కోసం కాదు ఏం కాదని రేవంత్ వెల్లడించారు. బుధవారం 99 టివి ఛానెల్ లో రేవంత్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో కేసిఆర్ కోల్ కత్తా కు ఎందుకు వెళ్లారు? ఎవరితో వెళ్లారో వివరించారు.

కేసిఆర్ మంత్రివర్గ సహచరులే కేసిఆర్ టూర్ పట్ల ఆగ్రహంగా ఉన్నట్లు రేవంత్ చెప్పారు. అంతేకాదు.. తెలంగాణ ప్రభుత్వంలో సింహభాగం కాంట్రాక్టులన్నీ దక్కించుకున్న ఒక బడా కాంట్రాక్టర్ కూడా కేసిఆర్ వెళ్లిన ఫ్లైట్ లో కోల్ కత్తా వెళ్లినట్లు తనకు సమాచారం అందినట్లు చెప్పారు.

కేసిఆర్ మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన లేదని ఆరోపించారు. ప్రజలు గెలిపించారు కాబట్టి నేను ఏమైనా చేస్తానన్నట్లు వ్యవహరిస్తున్నాని ఎన్నటికైనా కేసిఆర్ చేసిన దుర్మార్గాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కేసిఆర్ కోల్ కత్తా టూర్ గురించి రేవంత్ ఏం మాట్లాడారో వీడియోలో ఉంది చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *