తాము కూడా ప్రభుత్వం నుంచే వైదొలుగుతామని ఆంధ్రప్రదేశ్ బిజెపి కూడా ప్రకటించింది. ‘అన్ని అంశాలపై టిడిపి స్పందనను బట్టి మా ప్రతిస్పందన ఉంటుంది- మా మంత్రులిద్దరూ రేపు వైదొలుగుతారు,’అని బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కేంద్ర మంత్రుల రాజీనామా నేపథ్యంలో విజయవాడ హోటల్ ఐలాపురం లో బీజేపీ నేతలు అత్యవసర సమావేశం జరిపారు. హా మంత్రి మణిక్యాల రావు, ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ లు సోము వీర్రాజు, మాధవ్ తదితరులు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే అకుల ఈ విషయం ప్రకటించారు.
‘‘ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజకీయ సమీకరణాల్లో ఏ విధంగా జరగాలో అదే జరుగుతుంది. తెలుగు ప్రజలకు మాత్రం అన్యాయం జరగదు. చట్టంలో ఉన్న వాటిని అమలు చేయడం కూడా చట్ట ప్రకారమే చేయాలి. రెవెన్యూ లోటు, హోదా వల్ల వచ్చే లబ్ధిని ఎలా ఇస్తామో జైట్లీ వివరించారు. నాబార్డు ద్వారా కావాలంటే వెంటనే ఇస్తామని జైట్లీ చెప్పారు. తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పని చేస్తామని చెబుతున్నాం. మా మంత్రులెక్కడో ఉన్నారు- అందుకే రాలేకపోయారు. వారు రాజీనామా చేస్తారు,’ అని అకుల చెప్పారు.
బీజేపీ మంత్రి మాణిక్యాలరావు కామెంట్స్
**విభజన సమయంలో రాజ్యసభలో ఏపీ కోసం మాట్లాడిన వెంకయ్య నాయుడు ని దోషిగా చూపించటం సమంజసం కాదు
**ఏపీకి అండగా ఉన్న బీజేపీ ని దోషిగా చూపిస్తున్నారు
**కేంద్రంలో మంత్రి పదవుల నుంచి టీడీపీ బయటకు వస్తోంది కాబట్టి మేము ఇక్కడ మంత్రి పదవుల నుంచి బయటకు రావాలని నిర్ణయం
**దీనిపై మా అధిష్టానం నుంచి కాసేపట్లో స్పష్టమైన ఆదేశాలు రానున్నాయి
**ఏపీకి కేంద్రం సాయం చేసినా అర్థం చేసుకోవడం లేదు