దుబాయ్: శ్రీదేవి భౌతికకాయాన్ని కుటుంబీకులకు అప్పగించేందుకు ప్రాసిక్యూషన్ క్లియరెన్స్ ఇచ్చింది. ఈ మేరకు సంబంధితపత్రాలను దుబాయి పోలీసులు.. భారత దౌత్య అధికారులు, శ్రీదేవి కుటుంబసభ్యులకు అందజేశారు. అయితే ఎంబాల్మింగ్ ప్రక్రియ పూర్తయ్యాక కుటుంబీకులకు అప్పగించనున్నారు. ఈ విషయాన్ని భారత ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు అందించారని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇపుడు మృత దేహాన్ని ఎంబామింగ్ కు పంపిస్తారు. ఆతర్వాత ఇండియాకు ప్రత్యేక విమానంలో పంపిస్తారు.
Update: Dubai Police has handed over the Consulate and the family members letters for the release of the mortal remains of the Indian cinema icon Sridevi Boney Kapoor so that they can proceed for embalming.
— India in Dubai (@cgidubai) February 27, 2018