తెలుగుదేశం పార్టీకి కిక్ ఇచ్చే వార్త!

తెలుగుదేశం పార్టీని టిఆర్ ఎస్ విలీనం చేయాలని సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు అన్నారు.  పార్టీ ఎమ్మె ల్యేలంతా కట్టకట్టుకునిటి ఆర్ ఎస్ విలీనమయ్యారు. చిన్న చిన్నా పెద్ద లీడర్లంతా అధికార పార్టీ వైపు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు కాంగ్రెస్ లో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక్క సారి కూడా తెలంగాణ జిల్లాలలో పర్యటించలేదు.ఆయనకు మారుడు జిహెచ్ ఎంసి ఎన్నికల తర్వాత హైదరాబాద్ ను వదిలేశారు. స్వతంత్ర పార్టీగా బతకడం కష్టమని, వచ్చే ఎన్నికల్లో టిఆర్ ఎస్ తో పొత్తు ఉంటుందనిచాలా మందిలో అనుమానం ఉంది. తెలంగాణలో ఏ మాత్రం  ఆకర్షణలేని పార్టీ తెలుగుదేశం పార్టీయే. ఇలాంటి పరిస్థితిలో ఏంచేయాలో తెలియక పార్టీ క్యాడర్ గందరగోళంలో ఉన్నారు.  ఇలాంటి పార్టీలో ఎవరు చేరతారు…

చేరుతాను, నేనున్నాని ముందుకు వస్తున్నాడు మాజీ ఎమ్మెల్యే బిండిపుల్లయ్య.

రేపు(ఫిబ్రవరి 7) పార్టీ అధినేత  చంద్రబాబు సమక్షంలో కండవా కప్పుకుని తెలంగాణ లో తెలుగుదేశం  పార్టీ బలోపేతానికి జండా ఎగరేస్తానని పుల్లయ్య ప్రకటించారు.

బండి పుల్లయ్య ఎవరో తెలుసా?

ఆయన మహబూబాబాద్‌ మాజీఎమ్మెల్యే.  మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం కందికొండకు చెందిన వాడు.  విద్యార్థి దశ నుంచే వామపక్ష భావాలతో పెరిగాడు.  కమ్యూనిస్టు పార్టీలో ఒక  ముఖ్య నాయకుడిగా ఎదిగారు. అలా ఆయన రాజకీయాల్లో కి వచ్చారు.  1994 ఎన్నికలలో మహబూబాబాద్‌ నియోజకవర్గం నుంచి సిపిఐ అభ్యర్థిగా పోటీ చేశారు. అపుడు తెలుగుదేశం మిత్ర  పార్టీ గా  సిపిఐ పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా గెలుపొందారు. ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేశారు.   2001లో  టీఆర్‌ఎస్‌ ఏర్పాటులో కీలక పాత్ర వహించారు.  ఇతర వ్యవస్థాపక సభ్యల్లాగే ఆయన టిఆర్ ఎస్ లో కొనసాగలేకపోయారు. ఆపైన  తెలుగుదేశం మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌ ఏర్పాటు చేసిన నవతెలంగాణ పార్టీ లో చేరారు. అయితే,  ఆ పార్టీ పీఆర్‌పీలో వీలినం అయింది. తర్వాత పుల్లయ్య రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఇపుడాయన   మళ్లీ రాజకీయాలలో  క్రియాశీలక పాత్ర పోషించాలనుకుంటున్నారు. అందుకే టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి కిక్ ఇచ్చే వార్త.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *