’మేం శ్రీరాముడి వారసులం‘: బిజెపి ఎంపి దియాకుమారి

అయోధ్య భూవివాదాన్ని విచారిస్తున్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి ఒక ప్రశ్న ఎదురయింది. శ్రీరామచంద్రుడి రఘువంశానికి చెందినవాళ్లెవరైనా అయోధ్యలో నివసిస్తున్నారా అని కోర్టు ప్రశ్నించింది.
తాము శ్రీరాముని వారసులమని ఒక బిజెపి మహిళా ఎంపి చెప్పారు.
శ్రీరాముడి వారసులు ప్రపంచమంతా ఉన్నారని, అందులో తమకుటుంబం ఒకటని చెబుతూ తాము శ్రీరాముడి కుమారుడు కుశుడి వారసులమని రాజస్థాన్ లోని రాజసమంద్ నియోజకవర్గం  ఎంపి దియాకుమారి ట్విట్టర్ లో ప్రకటించారు.
ఈమె జైపూర్ రాజవంశానికి చెందిన మహిళ.
రామ్ లల్లా విరాజ్ మాన్ తరఫున సుప్రీంకోర్టు లో ఈ కేసుకు హాజరవుతున్న సీనియర్ అడ్వకేట్ కె పరాశరన్ ను విచారణ మధ్యలో బెంచ్ అడిగింది.
రామజన్మభూమి వివాదం మీద ఇపుడు కోర్టు రోజూ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.
శుక్రవారం నాటి విచారణలో జస్టిస్ ఎస్ ఎ బొబ్డే, డివై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ ఎ నజీర్ బెంచ్ అయోధ్యలో రఘువంశం వారుసులున్నారేమో  తెలుసుకుకోవాలనుకుంటున్నామని ప్రశ్నించారు.
దీనికి దియాకుమారి స్పందించారు.
‘శ్రీరాముడి వారుసులయినందుకు తాము గర్వపడుతున్నామని ఆమె పేర్కొన్నారు. మేమేదో ఆశించి ఇలా ప్రకటిస్తున్నామని అనుకోవద్దండి. రామజన్మభూమి మీద మాకు హక్కుందని మేం వాదించం. అదే విధంగా ఈ లీగల్ వివాదంలో కూడా భాగం కాదల్చుకోలేదు. ఏలాంటి దురుద్దేశం లేకుండా నా మనుసులో ఉన్నదాన్ని చెప్పాను,’ అని ఆన్నారు.

 

జైపూర్ రాజవంశీకులు కుచ్వాహ క్షత్రియ వంశానికి చెందిన వారు. శ్రీరామచంద్రుడి కుమారుడయిన కుశుడి వారసులని చెబుతారు. జైపూర్ యూనివర్శిటీ చరిత్ర సంస్కృతి విభాగం ప్రొఫెసర్ గా ఉండిన కీ.శే. ఆర్ నాథ్ దీని మద ఒక పుస్తకం కూడ రాశారు. ఆయన అనేక చారిత్రక అధారాలను పరిశీలించాక రామజన్మభూమి యాజమాన్యం బాధ్యత కుచ్వాహ వంశానిదేనని నిస్సందేహంగా చెప్పవచ్చని రాశారు.
జైపూర్ లోని సిటి ప్యాలస్ మ్యూజియం భద్రపరిచిన ఒక పురాతన మ్యాప్ ను ఈ రోజు అక్కడి ఒఎస్ డి రాము రామ్ దేవ్ విలేకరులకు చూపించారు.
ఆజ్మీర్ -జైపూర్ కు చెందిన సవాయ్ రాజా జైసింగ్ (1699-1743)లో అయోధ్యలోని రామ్ కోట్ భూమిని 1717లో కొన్నారు. అంటే ఔరంగా జేబు చనిపోయిన పదేళ్లకన్నమాట. అక్కడ ఒక రామాలయం కట్టించి జైసింగ్ పురాన్ని స్థాపించారు.
ఇలా ఆయన మెఘల్ సామ్రాజ్యంలోని కీలకమయిన పట్టణాలయిన కాబూల్, పెషావర్, ముల్తాన్, లాహోర్ , ఢిల్లీ, ఆగ్రా, పట్నా, ఔరంగా బాద్, ఎల్చిపూర్ లలో రామాలయాలను కట్టించారని ఆయన చెబుతున్నారు.

తన తండ్రి మాజీ జైపూర్ మహరాజ్ సవాయ్ భవాని సింగ్ తమ వంశం గురించిన పాత్రలను 1992లొనే కోర్టుకు సమర్పించారని ఆమె ఏ రోజు వెల్లడించారు. ఆయనది కుశుడి వారసత్వంలో 309 వ తరమని గతం లో జైపూర్ మాజీ రాణి చెప్పేవారని ఆమె గుర్తు చేశారు.