చిన్నారిని ఢీ కొన్న పోలీస్ వాహనం (వీడియో)

యాదగిరి గుట్ట పాత నరసింహ స్వామి టెంపుల్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి ప్రణతికి తీవ్రగాయాలయ్యాయి. దైవ దర్శనం చేసుకొని పక్కకు నిద్రిస్తుండగా రాచకొండ పోలీస్ వాహనం వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో చిన్నారి ప్రణతి తలకు బలమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే ప్రణతిని చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *