బాగా నైపుణ్యం ఉన్న ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఉద్యోగి కోసం అమెరికా సిలికాన్ వ్యాలీకి చెందిన ఒక కంపెనీ అమెరికా ప్రభత్వం మీద కేసు వేసింది.
తెలుగు కుర్రవాడి పేరు ప్రహర్ష చంద్ర అనిశెట్టి వెంకటసాయి. వయసు 28 సంవత్సరాలు. ఆయనకు హెచ్ వన్ బి వీసా ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం నిరాకరించింది.
వెంకటసాయి చాలా ప్రజ్ఞావంతుడని, ఆయనకు హెచ్ వన్ వీసా ఇవ్వడంలో తనకు విచక్షణాధికారాలను అమెరికా ప్రభత్వం దుర్వినియోగం చేసిందని సిలికాన్ వ్యాలీ టెక్ కంపెనీ ఎక్స్ టెర్రా వాదించింది. వెంకటసాయిని ఈ కంపెనీ బిజినెస్ ఎనలిస్టు రిక్రూట్ చేసుకుంది. యుఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కింద ఆయన వీసా నిరాకరించడం పొరపాటని ఈ కంపెనీ పేర్కొంది.
వీసా నిరాకరించేందుకు అవసరమయిన సాక్షాల బలాన్ని రికార్డుల్లో చూపలేదు. న్యాయపర సంప్రదాయాలకు భిన్నంగా ఉంది. చట్ట వ్యతిరేకం,ఇష్టారాజ్యంగాఉంది. స్పష్టంగా చట్టంలోని విచక్షణాధికారాలను దుర్వినియోగం చేయడమే, అని కంపెనీ పేర్కొంది.
“The denial is not supported by substantial evidence in the record, is contrary to established legal precedent, and is arbitrary, capricious and constitutes a clear abuse of discretion.”అని చెబుతూ అమెరికా USCIS ఉత్వరును కొట్టివేయలని ఈ కంపెనీ కోరింది.
H1B వీసా అనేది అమెరికా వలసపోయేందుకు ఇచ్చే వీసా కాదు, నిపుణులయిన ఉద్యోగులను అమెరికా కంపెనీ ఇండియా, చైనా వంటి దేశాలను రిక్రూట్ చేసుకునేందుకు వీలుకల్పించే అకాశమే ఈవీసా. దీని వల్లే టెక్నాలజీ కంపెనీలు ప్రతిసంవత్సరం వేలాంది యువకులను రిక్రూట్ చేసుకుంటూఉంటాయి.
ప్రతి సంవత్సరం 65 వేల మందికి ఈ వీసాలు ఇవ్వవచ్చని అమెరికా పార్లమెంటు అనుమతినిచ్చింది. టెకీ అమెరికా మాస్టర్సచేసిన ఇంకా ఉన్నత చదువుల చదివి ఉన్నా ఈ పరిమితి మించి కూడా హెచ్ 1 బివీసాలివ్వవచ్చు.
వెంకటసాయికి ఎలెక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉంది. అదేవిధంగా డల్లాస్ లోని టెక్సాస్ యూనివర్శిటీ నుంచి ఇన్ ఫర్మేషన్ టెక్నాజలీ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేశారు.
ఆయనకు భార్య ద్వారా డిపెండెంట్ కింద వచ్చే హెచ్ -4 వీసా కూడా ఉంది. అమెరికా లో చదువుకునేపుడ వచ్చి F1 నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ స్టుడెంట్ వీసా ఉంది. అమెరికా లో కరిక్యులార్ ప్రాక్టికల్ ట్రయినింగ్ కూడా పూర్తి చేశాడు.అందువల్ల ఆయన హెచ్ 1 బి వీసా వచ్చేందుకు అన్ని అర్హతలున్నాయని కంపెనీ వాదిస్తున్నది.