కేటిఆర్ టూర్ కోసం కలెక్టరమ్మ ఆమ్రపాలి బిజీ (ఫొటో స్టోరీ)

వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి ఫీల్డ్ విజిట్ చేశారు. పెళ్లయిన తర్వాత ఆమ్రపాలి మళ్లీ పాలనలో స్పీడ్ పెంచారు.

తాజాగా వరంగల్ నగరంలో ఆమె పర్యటించారు. ఈనెల 4వ తేదీన వరంగల్ నగరంలో మంత్రి కేటిఆర్ పర్యటన ఉంది.

ఉపముఖ్యమంత్రి, వరంగల్ జిల్లా మంత్రి అయిన కడియం కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు.

ఈ పర్యటన కోసం కలెక్టర్ ఆమ్రపాలి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఇద్దరూ నగరంలో పర్యటించారు.

ఎమ్మెల్యే దాస్యం వినయ్  భాస్కర్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రాపాలి కలిసి అభివృద్ధి పనులు చేయనున్న స్థలాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శివశంకర్ గారు మరియు కాజీపేట్, హన్మకొండ ఎమ్మార్వోలు సుబేదారి సీఐ ఇతర అధికారులు మరియు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *