కొత్తగూడెం రతన్ గుట్టపై స్మితా సభర్వాల్ హల్ చల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐఎఎస్ అధికారి స్మితా సభర్వాల్ పర్యటించారు. జిల్లాలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను ఆమె పరిశీలించారు. మే చివరి నాటికి కొత్తగూడెం జిల్లాలోని ప్రతీ ఇంటికి నల్లాతో శుద్ధి చేసిన నీళ్లు సరాఫరా చేయాలని అధికారులను ఆర్ డబ్ల్యూఎస్ అండ్ ఎస్ కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆదేశించారు. ప్రతీ అవాసానికి ప్రత్యేక షెడ్యూల్ తో ఇంట్రా విలేజ్ పనులు పూర్తి చేయాలన్నారు. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా మిషన్ భగీరథ పనులను స్మితా సభర్వాల్ పరిశీలించారు. ప్రజల ఆరోగ్య ప్రమాణాలను పెంచే మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్ట్ ను తన కెరీర్ లొనే చూడలేదన్నారు. ముందుగాల అశ్వాపురం మండలం రతన్ గుట్ట పై కడుతున్న ట్యాంక్ ను చూశారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా గుట్ట పై పనులు చేస్తున్నారని అధికారులు, వర్క్  ఏజెన్సీ ప్రతినిధులను మెచ్చుకున్నారు.ఆ తర్వాత గుట్ట కింద నిర్మించిన WTP ని పరిశీలించారు. ప్రతి విభాగాన్ని చూశారు. అక్కడే కొత్తగూడెం జిల్లా మిషన్ భగీరథ పనుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లాలో పనుల ప్రస్తుత స్థితిని అధికారులు వివరించారు. ఈ నెల 18 కి రతన్ గుట్ట WTP ట్రయల్ రన్ ప్రారంభం కావాలని, గుట్ట పై ఉన్న GLBR కు నీళ్లు చేరాలన్నారు. అక్కడి నుంచి తోగూడెం WTP కి రా వాటర్ పోవాలన్నారు. మే మొదటి వారానికి జిల్లాలోని 1383 ఆవాసాలకు శుద్ధి చేసిన నీళ్లు బల్క్ గా చేరాలన్నారు. ఏజెన్సీలతో పగలు, రాత్రి పని చేయించుకుని మే చివరి నాటికి జిల్లాలోని ప్రతీ ఇంటికి నల్లాతో నీటిని సరాఫరా చేసేందుకు ప్రయత్నించాలన్నారు. ఏ ఒక్క ఇంటిని కూడా వదిలి పెట్టకుండా నల్లా కనెక్షన్ ఇవ్వాలని స్మితా సభర్వాల్ సూచించారు.ఎస్సి, ఎస్టీ ఆవాసాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. మిషన్ భగీరథ కేవలం తాగునీటి ప్రాజెక్ట్ మాత్రమే కాదన్న స్మితా సభర్వాల్, ఆరోగ్య రంగం లో అద్భుతమైన మౌలిక సదుపాయాల పథకం అన్నారు. మిషన్ భగీరథ తో తెలంగాణ ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పెరుగుతాయన్నారు. నీటి సంబంధిత వ్యాధులు తగ్గడంతో ప్రజలు ఆ డబ్బులను చదువుతో పాటు ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటారని చెప్పారు.

తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్ధిక ముఖ చిత్రాన్ని మార్చేసే భగీరథ లో భాగం అవడాన్ని తాను గర్వంగా భావిస్తున్నానని అన్నారు. కొత్తగా Rws&s లో చేరిన ఇంజనీర్స్ కు భగీరథ, అద్భుత అవకాశం అన్నారు. జీవితం లో ఇంకోసారి భగీరథ లాంటి ప్రాజెక్ట్ లో పనిచేసే అవకాశం రాదన్నారు. కొత్తగా జాయిన్ అయిన ఇంజనీర్స్ ఫీల్డ్ వర్క్ లోను చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో RWS&S  ENC సురేందర్ రెడ్డి, కొత్తగూడెం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జాయింట్ కలెక్టర్ పమేలా సత్ పతి, చీఫ్ ఇంజినీర్ విజయ్ పాల్ రెడ్డి, జిల్లా ఎస్.ఈ శ్రీనివాస్,ఈఈ లు రవీందర్, సదాశివ, శ్యామ్ రావు, కన్సల్టెంట్ సురేష్ కుమార్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *