Home Uncategorized రుపాయ మీద ధనలక్ష్మి బొమ్మ ముద్రిస్తారా?: డాక్టర్ సుబ్రమణియన్ స్వామి

రుపాయ మీద ధనలక్ష్మి బొమ్మ ముద్రిస్తారా?: డాక్టర్ సుబ్రమణియన్ స్వామి

133
0
Dr Subramanian Swamy (Photo credits Twitter)
ఎపుడూ రాజకీయవివాదాలకు తెరదింపే బిజెపి ఎంపి డాక్టర్ సుబ్రమణియన్ ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఒక ఐడియా ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను బాగుచేసేందుకు ఆ ఆయన ఈ సలహా ఇచ్చారు. రుపాయ నోటు మీద ధనలక్ష్మి బొమ్మ వేస్తే శుభం జరుగుతుందని ఆయన చెప్పారు.
దీనికి ఆయన ఉదాహరణగా  ఇండోనేషియా ను చూపించారు. ఆదేశంలో 20000 రుపాయ నోటు మీద వినాయకుడి బొమ్మ ముద్రించారు. ఆదేశమే వినాయకుడి బొమ్మ ముద్రించుకున్నపుడు మనం లక్ష్మిదేవి బొమ్మను ఎందుకు ముద్రించరాదనేది ఆయన వాదన.
ఈ మధ్యఆర్థిక వ్యవస్థతో పాటు రూపాయ ఆరోగ్యంకూడా క్షీణిస్తూ ఉంది.
రుపాయనోటు మీద ధన లక్ష్మి బొమ్మ ముద్రిస్తే అది రుపాయ దుస్థితిని మెరుగుపరుస్తుందని ఆయన సలహా ఇచ్చారు.
ఆయన మధ్య ప్రదేశ్ ఖాండ్వాలో ‘స్వామి వివేకానంద వ్యాఖ్యానమాల’లొ ప్రసంగించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ సూచన చేశారు. తానయితే రుపాయ మీద లక్ష్మీ దేవి చిత్రం ముంద్రించాలనే భావిస్తున్నట్లు డా. స్వామి చెప్పారు.
‘ఇండోనేషియా కరెన్సీ మీద వినాయకుడి బొమ్మ ఉంటుందని చెబుతూ లక్ష్మీ దేవీ చిత్రం ముద్రించే విషయం మీద ప్రధాని నరేంద్ర స్పందించాలని ఆయన అన్నారు. ‘నేనయితే లక్ష్మీ దేవి చిత్రం ముద్రించడానికి అనుకూలం. వినాయకుడు విఘ్నాలను అడ్డుకుంటాడు.ఇలాగే లక్ష్మీదేవి చిత్రం భారతీయరుపాయ దుస్థితిని మెరుగుపరుస్తుందని నేను నమ్ముతున్నాను. దీని మీద ఎవరికీ అభ్యంతరం ఉండనక్కర్లేదు,’ ఆయన అన్నారు.
అంతకు ముందు తన ఉపన్యాసం ముస్లింల, హిందువుల డిఎన్ఎ ఒక్కటేనని ఆయన అన్నారు. ఏవిధంగా నైతే బ్రాహ్మణుల, దళితలు డిఎన్ ఎ ఒక్కటయినట్లే హిందువుల, ముస్లింల డిఎన్ ఎ కూడా ఒక్కటే నని అన్నారు.
భారతీయ జనతా పార్టీ తొందర్లోనే ఉమ్మడి పౌర స్మృతి తీసుకువస్తుందని కూడా ఆయన చెప్పారు. దేశంలో జనాభా పెరిగిపోవడం గురించి వ్యాఖ్యానిస్తూ 2025 నాటికి భారతీయ జనాభా చైనానుమించిపోతుందని అన్నారు.
ఇండోనేషియా వినాయకుడి కథ
ఇండినేషియాలో ఈ 20వేల రుపాయనోటును 1998లో ముద్రించారు. ఆదేశంలో అందరికి విద్య ప్రోగ్రాం అమలుచేస్తున్నపుడు ముద్రించిన నోటు ఇది. అంటే ఈ నోటు వెనక ఉన్న ధీమ్ విద్య. అందుకే ఈ రుపాయనోటుకు ఒక వైపు క్లాస్ రూం బొమ్మ ఉంటుంది. మరొక వైపు వినాయకుడి బొమ్మ ఉంటుంది. ఆదేశ జాతీయోద్యం నాయకుడు కీ హాజర్ దేవాంతర (Ki Hajar Dewantara) జన్మదినాన్ని(మే 2) జాతీయ విద్యా దినోత్సవంగా అక్కడ జరుపుకుంటారు.జర్నలిస్టుగా జీవితం ప్రారంభించిన దేవాంతర కు  ఇండోనేషియా నేషనల్ హీరోగా ఆయనను ప్రజలు గౌరవిస్తారు. స్వాంతత్య్రం వచ్చాక కొద్ది రోజులు ఆయన విద్యా శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన జావా ఆదివాసీ పేదవాళ్ల విద్య కోసం పాఠశాలలు స్థాపించారు. ఇండోనేషియా పేరుకు ముస్లిం దేశమే అయినా,అక్కడ హిందూ (దేశ జనాభాలో 3 శాతమే) సంప్రదాయాల ప్రభావం చాలా ఎక్కువ. అందుకే అక్కడ హిందూదేవతలు, చిహ్నాలు చాలచోట్ల కనిపిస్తాయి.ఆయన చెప్పిన సూక్తి ఒకటి బాగా ప్రాచుర్యం పొందింది. అది  “ing ngarso sung tulodo, ing madyo mangun karso, tut wuri handayani”, దీని అర్థం : ముందువరసలో ఉన్నవాళ్లు ఆదర్శంగా ఉండాలి. మధ్యలో ఉన్నవాళ్లు స్ఫూర్తినీయాలి. వెనకన ఉన్నవాళ్లు ప్రోత్సహించాలి, అని.
(Those in front should set an example, those in the middle should raise the spirit, and those in the back should give encouragement)

 

ఇంతకీ వినాయకుడి బొమ్మ ఎందుకు వచ్చింది?
దీనికి రెండు కారణాలున్నాయి. ఆదేశంలో ఆదివాసీలలో హిందూ మత ప్రభావం ఉన్న వాళ్లు కూడా ఉన్నారని, వారి కోసం ఈ బొమ్మ వేశారని కొంతమంది చెబుతారు. అయితే,మరొక వాదన ప్రకారం, ఇండోనేషియా రుపయా పతనమవుతున్నపుడు దానిని నివారించే విఘ్నాధిపతి అయిన వినాయకుడి బొమ్మ ముద్రించారని చెబుతారు.  ఈ రోజులో ఇండోనేషియా రుపయా బాగా బలహీనపడుతూ ఉంది. దీనిని అరికట్టేందుకు విఘ్నేశ్వరుడి బొమ్మ ముద్రించడం ఒక మార్గమని  అప్పటి మంత్రి ఒకరు సూచించారని అందుకే ఈపని చేశాారని చెబుతారు. దీనికి అధికారిక ధృవీకరణేమీలేదు. అయితే, ఇపుడు డాక్టర్ సుబ్రమణియన్ స్వామి కూడ ఇలాంటి చికిత్సయే సూచించారు.