Home Uncategorized రాయలసీమ చర్చ: చలసాని గారూ మీరా విద్వేషాలు గురించి మాట్లాడేది ?

రాయలసీమ చర్చ: చలసాని గారూ మీరా విద్వేషాలు గురించి మాట్లాడేది ?

279
0

రాయలసీమకు చెందిన బిజెపి నేతలు కర్నూలులో సమావేశం జరిపి రాయలసీమ డిక్లరేషన్ పేరుతో ఒక నివేదికను విడుదల చేసినారు. వారు ప్రస్తావించిన  ప్రతి అంశం గడిచిన కొన్ని సంవత్సరాలుగా రాయలసీమ ఉద్యమ సంస్థలు చెపుతున్న విషయాలే. సహజంగా సీమ అబివృద్దిని కోరుకునే వారు వారి తీర్మానాన్ని ఆహ్వనిస్తున్నారు.

సీమ వివక్ష, అబివృద్ధి విషయంలో రాజకీయ అంశాలతో ముడిపెట్టడం అంగీకారం కాదు…….

 

రాజకీయంగా బిజెపివిదానాలపట్ల ఉన్న అవగాహనతో వారు చేసిన సీమ తీర్మానంతో ముడిపెట్టి మాట్లాడం అంగీకారం కాదు. బిజెపి రాజకీయ విషయాలపై నాకు కూడా భిన్నాబిప్రాయాలు ఉన్నాయి. వాటిని ఆయా సందర్భాలలో నిర్మోహమాటంగానే విమ ర్శించాను. కానీ నిన్న వారు చేసిన రాయలసీమ తీర్మానాన్ని కచ్చితంగా స్వాగతి స్తాము. ఎందుకంటే రాయలసీమకు కచ్చితంగా రాజకీయ పరిష్కరం తప్పనిసరి. ఒక జాతీయ పార్టీగా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఆ అభిప్రాయాలు సీమ సమాజం చాలాకాలం నుంచి చెపుతున్న విషయాలే కావడం వలన సీమ ప్రజాసంఘాలు స్వాగతించినాయి. అంత మాత్రన వారి రాజకీయ అంశాలతో కలినట్లు కాదు. నిద్రపోతే, నిద్ర లేస్తే ఎన్నికలు, పొత్తులు గురించి ఆలోచించే వారికి ప్రతిది రాజకీయంగానే కనిపించవచ్చు. వారికున్న కోణాన్ని ఈ విషయంలో కూడా చొప్పించడం సరికాదు.

చలసాని గారు మీకు విద్వేషాలు గురించి మాట్లాడే అర్హత ఉందా

మొదటి నుంచి రాయలసీమ వ్యతిరేకతను ఒంటి నిండా నింపుకున్న మీరు విద్వేషాల  గురించి మాట్లాడటమా? విభజన సందర్భంలో సమైక్యాంధ్ర ప్రతినిదిగా డిల్లీలో కుర్చుని మీరు చేసింది ఏమిటి అమరవతి రాజదాని అవుతుంది కాబట్టి దానికి కేంద్రం నిదులు ఇవ్వాలి, అమరావతి నుంచి విశాఖకు ఉపయోగపడే పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా చేసుకుని దానికి ఇబ్బంది కలుగుతుందని రాయలసీమకు ప్రాణపదం అయిన దుమ్మగూడెం టేల్ పాండును చట్టంలో లేకుండా కుట్ర చేసిన దానిలో మీపాత్ర ఎంత చెప్పగలరా? శివరామక్రిష్ణన్ అమరావతి రాజధానికి సరిఅయిన ప్రాంతం కాదు అన్న నివేదిక ఇస్తే అది చర్చకు వస్తే సీమకు రాజధాని వెలుతుందని అక్కసుతో వారి మీద విషంగక్కింది మీరు కాదా ? నేడు రాయలసీమ ప్రజలు, న్యాయవాదులు కనీసం హైకోర్టు అయిన సీమకు ఇవ్వాలని కోరుతుంటే కనీసం నోరు మెదపని ఆంధ్రా మేధావుల (అమరావతి) నేత అయిన మీరు విద్యేషాలు గురించి మాట్లాడటం. హోదా పోరాటం జరుగుతున్నపుడు మాత్రమే మీకు రాయలసీమ కడప ఉక్కు , ప్యాకేజీలు గుర్తుకు వస్తాయి. నాడు విశాఖ ఉక్కు ఆంద్రల హక్కు అన్న మీరు నేడు కడప ఉక్కు రాయలసీమ హక్కు అనడంలోనే మీనీతి అర్థం అవుతుంది. మీ సాయం గురించి మేము అడగడం లేదు కానీ మాకు మీరు నీతులు చెప్పనవసరంలేదు.

BJP మీద ఉన్న రాజకీయ కోపంతో సీమ సమస్యలను ముడి పెట్టడం CPI కి తగదు…..

CPI కి బిజెపి రాజకీయలపట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది అందుకు మాకు ఎటువంటి అబ్యంతరం లేదు. కానీ వాటిని సీమ సమస్యలతో ముడిపెట్టడం తగదు. అందులోనూ సీమ ప్రాంతానికి చెందిన రామక్రష్ణ గారు సీమ వ్యతిరేకి అయిన చలసాని గారితో కలిసి మాట్లాడం ఘోరం. సీమలో న్యాయవాదులు ఆందోళన చేస్తుంటే కనీసం మద్దతు కూడా ఇవ్వకుండా హోదా పోరులో తలమునకలైఉన్నారు. మీ రాజకీయాలు మీరు చేసుకోండి కానీ రాయలసీమ సమస్యలను ముందుకు తెచ్చిన బిజెపి ని ఈ సందర్భంగా విమర్సించడం మంచిది కాదు. అయినా మీరు బిజెపిని విమర్సించుతున్నారా లేదా వారు లేవనెత్తిన అంశాలను కూడా వ్యతిరేకిస్తున్నారు నిజాయితీగా మాట్లాడండి. బిజెపిరాజకీయ కారణాలతో సీమ సమస్యలు మాట్లాడుతున్నది అంటున్నారు నిజమే అనుకుందాం 4 సంవత్సరాలు మౌనంగా ఉండి నేడు ఏదో జరిగిపోయింది అంటున్న బాబుగారిది రాజకీయం కాదా, కేంద్రం ఎందుకు సాయం చేయలేదంటే జగన్ మనతో కలుస్దాడు అన్న దీమ బిజెపి ది. అంటున్న చలసానిగారిది ఏ రాజకీయం? కేంద్రం, రాష్ట్రం పెద్దలను మాట అనకుండా ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ కమిటీల పేరుతో రాజకీయాలు చేస్తున్న పవన్ ది ఏ రాజకీయం? కాబట్టి ప్రజలకు సంబంధం లేకుండా తమ ప్రయోజనాలే ప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్న నేటి కాలంలో రాజకీయాలు గురించి మాట్లాడం హశ్యాస్పదం అవుతుంది. అయిన సీమలో పుట్టిన మీరు గుంతకల్లును కాకుండా విశాఖ కు రైల్వేజోన్ అని, రాయలసీమలో ఉండాల్సిన రాజధానిని అమరావతికి తరలించనపుడు మాట్లాడకుండా సంమర్దించడం మీది రాజకీయంకాదా…

 

– పురుషోత్తమ రెడ్డి, రాయలసీమ మేధావుల సంఘం, తిరుపతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here