భాను సందీప్ మార్ని నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రీ లుక్ మరియు క్యారెక్టర్ పోస్టర్లకు మంచి స్పందన లభించగా, పొలిటికల్ సెటైర్‌గా రూపొందుతోన్న ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
దర్శకుడు తేజ మార్ని మాట్లాడుతూ ‘‘నేను ప్రముఖ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మగారి వద్ద ‘వంగవీటి’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేశాను. అలాగే ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌గారి వద్ద రచనా విభాగంలో పనిచేశాను. డైరెక్టర్ గా నా తొలి చిత్రమిది.‘జోహార్’ చిత్రం పొలిటికల్ సెటైర్‌గా రూపొందుతోన్న ఎమోషనల్ డ్రామా. షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమా ప్రధానంగా ఐదు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఐదు పాత్రలు అద్భుతంగా ఆకట్టుకుంటాయి. డిఫరెంట్‌గా ఉంటాయి. వారణాసి, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించాం ‘భైరవగీత’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సిద్ధార్థ్ ఈ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేశారు. త్రిష ‘నాయకి’,‘భైరవగీత’ చిత్రాలకు వర్క్ చేసిన జగదీశ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్యప్రసాద్ పాటలు రాశారు. ‘రాక్షసుడు’, ‘జార్జిరెడ్డి’ చిత్రాలకు పనిచేసిన గాంధీ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు’’ అన్నారు.
‘దృశ్యం’ చిత్రంలో వెంకటేశ్ కూతురిగా నటించిన ఈస్తర్ అనిల్, ‘వంగవీటి’ ఫేమ్ నైనా గంగూలీ, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈశ్వరీరావు, రోహిణి, శుభలేఖ సుధాకర్, చైతన్యకృష్ణ తదితరులు ఇందులో ప్రధాన తారాగణం .
దర్శకుడు: తేజ మార్ని
నిర్మాత: భాను సందీప్ మార్ని
సంగీతం: ప్రియదర్శన్
ఎడిటర్: సిద్ధార్థ్
సినిమాటోగ్రఫీ: జగదీశ్
పాటలు: చైతన్యప్రసాద్
`సమరం` ట్రైలర్‌ను విడుదల చేసిన రాజ్ కందుకూరి